OTT Platforms : పెద్ద హీరోతో సినిమా అంటే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అయినా డిజాస్టర్ అయినా ఓటీటీ తో రికవరీ అయిపోతుంది అని అనుకునే రోజులు ఇప్పుడు మారిపోయాయి. దీని గురించిన చర్చలే ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఇప్పుడు రెండు సినిమాల పేర్లు బాగా వినిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో ఒకటి ఒక ప్రముఖ హీరో క్యామియో అని చెప్పి తమకు నచ్చినట్లు పాత్ర నిడివి ని పెంచి బాక్స్ ఆఫీస్ వద్ద అనుకోని విధంగా డిజాస్టర్ అయిన ఒక సినిమా. నిజానికి సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో షూటింగ్ అప్పుడు తీసిన 20 నిమిషాల ఫుటేజ్ పోయిందట. దీంతో హడావిడిగా ఎడిటింగ్ చేసి థియేటర్లకు వదిలేసింది చిత్రం బృందం.


కానీ సినిమా ఫ్లాప్ అయ్యి నిర్మాతలకు భారీ నష్టాలు వాటిల్లాయి. ఆ సినిమా ఈవారం ఒక ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీద విడుదల కాబోతోంది. కానీ తమకు చెప్పిన అవుట్ పుట్ రాలేదని, అందుకే ఇంతకుముందు చెప్పిన రేట్ ఇవ్వలేమని ఆ ఓటిటి ప్లాట్ ఫామ్ చిత్ర బృందానికి చెబుతోందట.


దీంతో సినిమా డిజిటల్ రిలీజ్ ఆగిపోయింది. అయితే సినిమాని రీ షూట్ చేసి ఇవ్వండి లేదా ఇక్కడితో మర్చిపోండి అని ఓటిటి ప్లాట్ ఫామ్ వారు అడగడంతో ఇప్పుడు నిర్మాతకి కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. 


ఇక రెండవది ఒక హిందీ సినిమా. గత ఏడాది దసరాకి రిలీజ్ అయింది. చాలామంది స్టార్లతో విడుదలైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. కనీసం సినిమా బడ్జెట్ తో పావు వంతు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది ఈ చిత్రం. ఏ రేంజ్ లో ప్రమోషన్లు జరిగినా కూడా అభిమానులు ఈ సినిమాని ఆదరించలేదు. 


 నిజానికి ఈ సినిమా కోసం ఓటిటి ప్లాట్ ఫామ్ వారు 70 కోట్లను ఇవ్వాలి కానీ సినిమా క్వాలిటీ ఏమాత్రం బాగోలేదని ఆ ఓటిటి వారు నిర్మాతకి లీగల్ నోటీసులు పంపారట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ రెండు సినిమాలను ఒకే ఓటిటి ప్లాట్ ఫామ్ కొనుక్కుంది. కానీ పాలసీ విషయాల్లో వీరు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారట.  దీంతో నిర్మాతలు కూడా ఇకపై అయినా అలాంటి తప్పులు జరగకూడదని జాగ్రత్త పడుతున్నారు.


Also read: IPL 2024 SRH vs KKR: క్షణాల్లో మారిన సీన్, పాపం కావ్య పాప..సోషల్ మీడియాలో వైరల్


Also read: Pat Cummins: అతడే కారణం, మ్యాచ్ ఓటమికి కారణాలు వివరించిన కమిన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook