IPL 2024 SRH vs KKR: ఐపీఎల్ 2024 సీజన్ 7 రెండో రోజు రెండు అద్భుతాలు జరిగాయి. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోవల్సిన మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ లెవెన్ గెలిచి చూపిస్తే...ఘోర పరాజయం చెందాల్సి మ్యాచ్ విజయం ముంగిట వరకూ నిలిచి..అంతలో మళ్లీ మనసు మార్చుకుని ఓటమికై పైచేయి అందించింది. ఇదే మరి క్రికెట్ అంటే..అందుకే కావ్య పాప అంత విచారంలో వెళ్లిపోయింది.
ఐపీఎల్ 2024 సీజన్ 17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓ దశలో కేకేఆర్ 15-170 పరుగులే చేయగలుగుతుందనుకున్న దశలో ఆండ్రూ రస్సెల్ ఊచకోత ఏంటో చూపించి కేవలం 25 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 7 సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆ తరువాత బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మయాంగ్ అగర్వాల్, అభిషేక్ శర్మ మంచి ఆరంభాన్నే ఇచ్చినా ఆ తరువాత వికెట్లు పడిపోయాయి. అటు రిక్వైర్డ్ రన్‌రేట్ అమాంతం పెరిగిపోయింది. ఎంతవరకూ వెళ్లిందంటే 24 బంతుల్లో 76 పరుగులు కావల్సిన పరిస్థితి. అంతే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిపోతుందని అనుకున్నారంతా.
ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్‌తో కలిసి మ్యాచ్ చూసేందుకు వచ్చినా కెమేరాకు కన్పించకుండా జాగ్రత్త పడింది. మ్యాచ్ పోతుండటంతో ముఖం చాటేసింది. కానీ అంతలో హెన్రిచ్ క్లాసెన్ చెలరేగిపోవడం, అతనికి షహబాజ్ ఖాన్ సహకరించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. 17, 18, 19 ఓవర్లలో వరుసగా 16, 21, 26 పరుగులు సాధించారు. దాంతో చివరి ఓవర్లో 6 బంతులకు కేవలం 13 పరుగులకు మారిపోయింది సీన్.
Kavya Maran is Happy!pic.twitter.com/Vl58F1B9sy
— CricketGully (@thecricketgully) March 23, 2024
అంతే అంతవరకూ కెమేరా కంటికి కన్పించకుండా ఉన్న కావ్య పాప తండ్రితో కలిసి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ఆనందంతో ఎగిరి గంతులేసింది. ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. చివరి ఓవర్ మొదటి బంతికి క్లాసెన్ మరో సిక్సర్ కొట్టడంతో ఇక మ్యాచ్ పూర్తిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వైపుకు వచ్చేసింది. ఇక 5 బంతుల్లో కేవలం 7 పరుగులు చేస్తే చాలు. విజయం ఖాయమని తెలుసుకుని కావ్య పాప చాలా ఆనందించింది.
Just how fast the night changes?
Kavya Maran always having the bad luck #KKRvsSRH IPL is IPLing pic.twitter.com/LmvNnkXmRd— Abel (@weekndtweets) March 23, 2024
అంతే మళ్లీ సీన్ మారిపోయింది. రెండో బంతికి క్లాసెన్ సింగిల్ తీయడం మూడో బంతికి షెహబాజ్ అవుట్ అవడం వెనువెంటనే జరిగిపోయాయి. నాలుగో బంతికి జాన్సన్ సింగిల్ తీస్తే..ఐదో బంతికి క్లాసెన్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అవడంతో మొత్తం అంతా షాక్ అయిపోయారు. కేవలం 3 బంతుల్లో సీన్ మొత్తం మారిపోయింది. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా ఒక్క పరుగు చేయలేకపోయింది ఎస్ఆర్హెచ్. అంతే గెలుపు ముంగిటకు వచ్చిన మ్యాచ్ చేజారిపోయింది. అంతవరకూ తండ్రితో కలిసి ఆనందంతో గెంతులేసిన కావ్య పాప ముఖంపై నిరాశ, విచారం స్పష్టంగా కన్పించాయి. క్షణాల్లో ఆమెలో మారిన హావ భావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపం కావ్య పాప అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also read: Pat Cummins: అతడే కారణం, మ్యాచ్ ఓటమికి కారణాలు వివరించిన కమిన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook