Case on Aishwarya Addala: భర్త వేధింపులు భరించలేక భార్యలు విడాకులు కోరడం సర్వసాధారణం. అయితే బుల్లితెరపై సీరియల్స్ లో జరిగిన విచిత్రాల లాగా .. నా భార్య నన్ను వేధిస్తోంది కాపాడండి అంటూ మీడియా ను ఆశ్రయించాడు ఓ భర్త. ఇంతకీ అతను ఎవరో కాదు ప్రముఖ టీవీ సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య అడ్డాల భర్త. పెళ్లి చేసుకున్న తర్వాత తన డబ్బులు మొత్తం కాజేసింది కాక ఇప్పుడు విడాకులు కోసం మానసికంగా ఇబ్బంది పెడుతోంది అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఆమె వేధింపులు తట్టుకోలేక పోతున్నాను అని మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎడాది సెప్టెంబర్ 6 వ తారీఖున  ఐశ్వర్యాలతో శ్యామ్ కు వివాహం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి జరిగే ఆరు నెలలు కూడా గడవకముందే  భర్త దగ్గర ఉన్న పాతిక లక్షల రూపాయలను కాజేసిన ఐశ్వర్య  విడాకులు కోరుతూ శామ్ తోపాటు అతని తల్లిదండ్రులను కూడా మానసికంగా ఇబ్బంది పెడుతోందట. మరో వ్యక్తితో కలిసి కేసులు పెడతాను అంటూ తన భార్య తనను బెదిరిస్తోందని.. తనకు న్యాయం చేయాలి అని శ్యామ్ కోరుతున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాదుకు వెళ్లాక ఆమె నిజ స్వరూపం తెలిసిందని శ్యామ్ చెబుతున్నారు. ఐశ్వర్య కు దురలవాట్లతో పాటు రమేష్ బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కూడా ఉందని శ్యామ్ ఆరోపిస్తున్నారు.


పెళ్లయిన నెల రోజులకే ఐశ్వర్య.. రమేష్ బాబు మధ్య ఉన్న అఫైర్ గురించి తెలుసుకొని నిలదీసిన తన పై  ఆమె ఎదురు దాడి చేసిందని శ్యామ్  వాపోయాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో విషయం విడాకుల వరకు వచ్చింది. విడాకులు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కి పంపిస్తానని ఆమె వేదిస్తోందట. ఈ విషయంలో ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఆమెనే సమర్థిస్తూ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని శ్యామ్ మీడియాకు వెల్లడించారు. సాక్ష్యంగా రమేష్ బాబు ,ఐశ్వర్యతో తాను మాట్లాడిన ఆడియో కాల్ రికార్డింగ్స్ ను అతను మీడియా ముందు బయట పెట్టాడు.


ఐశ్వర్య బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. సీరియల్స్ తో పాటు ఆమె పలు సినిమాలలో కూడా నటించింది. అమ్మాయి గారు, పలుకే బంగారమాయేనా, అల వైకుంటపురం, అత్తారింటికి దారేది లాంటి సీరియల్స్ లో ఐశ్వర్య నటించిన. కాపు మ్యాట్రిమోనీ ద్వారా ఐశ్వర్య గురించి తెలుసుకున్న పిన్నింటి శ్యామ్ కుమార్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.మీడియా ముందు శ్యామ్ చెప్పిన మాటలు అందరినీ షాక్ కి గురిచేసాయి. అయితే ఇంకా ఈ విషయం పై ఐశ్వర్య స్పందించలేదు.


Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్‌ జగన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter