KGF Chapter 2: రాకీ భాయ్ యశ్..కేజీఎఫ్ ఛాప్టర్ 2 దుమ్ము రేపేస్తోంది. మాస్ ఎంటర్‌టైన‌ర్‌గా  ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా బాక్సాఫీసుల మోత మోగిస్తోంది. 12 రోజుల్లోనే భారీ రికార్డు సొంతం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్నడ నటుడు యశ్ అలియాస్ రాకీ భాయ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 హిట్ మామాలుగా లేదు. కన్నడ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన రాకీ బాయ్..కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. దమ్మున్న మాస్ ఎంటర్‌టైనర్‌గా విడుదలై...ఒక్కొక్క సినిమా రికార్డును బద్దలగొడుతూ ముందుకు దూసుకుపోతోంది. 


ఇప్పటికే అమీర్ ఖాన్ సినిమా దంగల్ రికార్డుల్ని చేరుకుంటోంది. కేవలం 12 రోజుల్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 9 వందల కోట్ల మార్క్ దాటేసిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశాడు. తొలివారంలో 720.31 కోట్లు వసూలు చేసింది. రెండవ వారంలో తొలిరోజు 30.18 కోట్లు, రెండవరోజు 26.09 కోట్లు, మూడవ రోజు 42.15 కోట్లు, నాలుగవరోజున 64.83 కోట్లు, ఐదవరోజున 23.74 కోట్లు వసూలు చేసింది. త్వరలో కేజీఎఫ్ 2 దంగల్ సినిమా కలెక్షన్లను దాటేస్తుందని మరో సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.


వాస్తవానికి కేజీఎఫ్ 2 అనేది ఒరిజినల్ కన్నడ సినిమా. ఈ సినిమాను హిందీ , మళయాలం, తమిళం, తెలుగు భాషల్లో డబ్ చేశారు. ఈ సినిమాలో యశ్, సంజయ్ దత్‌తో పాటు రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, బాలకృష్ణ, అనంత్ నాగ్, మాళవిక అవినాష్, సరన్ శక్తి, అచ్యుత్ కుమార్‌లు ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 


Also read: LIC Share Price: ఎల్ఐసీ ఐపీవో ఎప్పట్నించో తెలుసా, ఒక్కొక్క షేర్ ఎంతంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook