Pavitra Lokesh opens up: గత కొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం మీద నటి పవిత్ర లోకేష్ ఒక వీడియో విడుదల చేశారు. తనకు నటుడు నరేష్ గారికి వారి కుటుంబానికి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూనే రమ్య రఘుపతి అనబడే నరేష్ గారి భార్య అంటూ ఆమె మీద పవిత్ర ఆరోపణలు గుప్పించారు. నరేష్ గారు తెలుగు నటుడు కాబట్టి అడిగితే హైదరాబాదులో న్యాయం అడగాలని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లేదా నిజంగా ఆయనతో కాపురం చేసే ఉద్దేశం ఉంటే వారి కుటుంబ పెద్దల ద్వారా సమస్య సాల్వ్ చేసుకోవాలి కానీ బెంగళూరు వెళ్లి మీడియా ముందు రచ్చ చేయడం చూస్తే కచ్చితంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఆమె ప్రయత్నిస్తోందని పవిత్ర లోకేష్ పేర్కొన్నారు. తాను తెలుగు సినీ పరిశ్రమకు కొత్త కాదని, చాలా ఏళ్లుగా ఇక్కడ యాక్ట్ చేస్తున్నాను కాబట్టి తాను మీ అందరికీ పరిచయమే అని ఆమె చెప్పుకొచ్చారు. తనకు ఉన్న ఏకైక సమస్యను మీ దృష్టికి తీసుకురావాలని వీడియో విడుదల చేస్తున్నానని పేర్కొన్న ఆమె నరేష్ గారి భార్య రమ్య, వాళ్ల మధ్యకి నేను వచ్చి వారి కుటుంబాన్ని నాశనం చేశానని ఆరోపణలు చేశారని అది నిజం కాదని అన్నారు. 


ఆమె చేసిన ఆ వ్యాఖ్యలు తనను బాధపెట్టాయని పవిత్ర పేర్కొన్నారు. నిజంగా ఆమెకు భర్త కావాలనిపిస్తే భర్తతో కాపురం చేయాలనిపిస్తే కుటుంబ పెద్దలతోనే మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలి కానీ ఇలా తనమీద కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు నరేష్ గారికి సపోర్ట్ చేయాలని పవిత్ర లోకేష్ కోరారు. ఇక అంతకంటే ముందు నటుడు నరేష్ కూడా ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. పవిత్ర గురించి స్పందించకుండానే రమ్య రఘుపతి కావాలని ఇదంతా ప్లాన్ చేసి చేస్తుందంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.
Also Read: God Father First Look: గాడ్ ఫాదర్ ఆరంగ్రేటానికి ముహూర్తం సిద్దం.. ఇక రచ్చే!


Also Read: The Warrior Movie Trailer: ‘ది వారియర్‌’ ట్రైలర్‌లో పవర్ ఫుల్ పోలీస్‌గా ఆకట్టుకున్న రామ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook