The Warrior Movie Trailer: ‘ది వారియర్‌’ ట్రైలర్‌లో పవర్ ఫుల్ పోలీస్‌గా ఆకట్టుకున్న రామ్

  The Warrior Movie Trailer: స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ మొట్టమొదటిసారి పోలీసు అధికారిగా నటిస్తున్న సినిమాకు ది వారియర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2022, 08:32 PM IST
  • రామ్ హీరోగా ది వారియర్
  • విడుదలకు సిద్దమవుతున్న ది వారియర్
  • ఆకట్టుకున్న ది వారియర్ ట్రైలర్
The Warrior Movie Trailer: ‘ది వారియర్‌’ ట్రైలర్‌లో పవర్ ఫుల్ పోలీస్‌గా ఆకట్టుకున్న రామ్

The Warrior Movie Trailer: చాలా కాలం పాటు సరైన హిట్ సినిమా లేక ఇబ్బంది పడిన రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన రెడ్ అనే సినిమా బోల్తా పడింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకక్కిన ఆ సినిమా రామ్ కెరియర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా మళ్ళీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన చాలా కాలం పాటు వేచి చూసి తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేశాడు. తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి పోలీసు అధికారిగా నటిస్తున్న ఈ సినిమాకు ది వారియర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తమిళ తెలుగు భాషలలో ఏకకాలంలో రూపొందింది. ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అనే బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించారు. రామ్ బోయపాటి కాంబినేషన్ సినిమా కూడా ఇదే బ్యానర్ లో తెరకెక్కబోతోంది. అయితే రామ్ వారియర్ సినిమా విడుదల తేదీ దగ్గరపాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, కొన్ని పాటలు విడుదల చేయగా అన్నీ కూడా మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.

 ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా అంచనాలు పెంచే విధంగా సాగింది. రెండు నిమిషాల 45 సెకండ్ల పాటు సాగిన ఈ ట్రైలర్లో రామ్ పోతినేని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఏ మాత్రం బెరుకే లేని పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని చెప్పాలి. రామ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా కర్నూలు నగరంలో అడుగుపెట్టడంతో అదే ఊరిలో ఆర్జేగా పనిచేస్తున్న కృతి శెట్టిని కలుస్తాడు. అక్కడే కృతి శెట్టి- రామ్ మధ్య ప్రేమ మొదలైనట్టు కూడా ట్రైలర్ లో చూపించారు. ఇక రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఢీకొనే పాత్రలో ఆది పినిశెట్టి కనిపించారు. ఒక పూర్తిస్థాయి మాస్ మసాలా లుక్ లో ఆది పినిశెట్టి ఆకట్టుకున్నారు. తమిళ దర్శకుడు కావడంతో ఆదిని మేకప్ ఏమాత్రం లేకుండా మాస్ పాత్రలో చూపించేందుకు ప్రయత్నం చేశారు. పోలీస్ ఆఫీసర్ గా రామ్, ఊరిలో పక్కా మాస్ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించి ఆకట్టుకున్నారు. భారీ అంచనాలతో రూపొందిన్న ఈ సినిమా జూలై 14న విడుదల కాబోతోంది. 

Also Read: Bimbisara Update: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు.. 'బింబిసార' ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌!

Also Read: Actress Meena: ఇకనైనా అసత్య ప్రచారం ఆపండి..భర్త మరణంపై నటి మీనా భావోద్వేగ లేఖ..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News