MEGA Menacing Arrival of the God Father: రాజకీయాల్లోకి వెళ్లి సినీ రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత వరుస సినిమాలతో సందడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఖైదీ నెంబర్ 150, సైరా వంటి సినిమాలతో తన అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరినీ అలరించిన ఆయన ఆచార్య సినిమాతో మాత్రం భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నారు. ఆచార్య సెట్స్ మీద ఉన్న సమయంలోనే ఆయన అనేక సినిమాలు లైన్లో పెట్టారు. అందులో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ తెలుగు రీమేక్ కూడా ఒకటి. మలయాళంలో లూసిఫర్ పేరుతో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్, వివేక్ ఒవేరాయి పాత్రలో సత్యదేవ్, మంజూ వారియర్ పాత్రలో నయనతార వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో హనుమాన్ జంక్షన్ లాంటి సినిమా తెరకెక్కించి తర్వాత తమిళ సినీ పరిశ్రమకు వెళ్లి అక్కడే దర్శకుడిగా స్థిరపడిన మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎన్‌వి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక మెగా అప్డేట్ ఇచ్చేసింది కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని పేర్కొంటూ ఒక ప్రీ లుక్ విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఒక అంబాసిడర్ కారును చూపిస్తూ జోరున వర్షం కురుస్తుంటే చుట్టూ గొడుగులు పట్టుకున్న వ్యక్తులను చూపించారు. పొలిటికల్- మాఫియా సంబంధాల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ లూసిఫర్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి మంచి కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా తెరకెక్కించే అవకాశం చాలా మంది దర్శకులను దాటి చివరికి మోహన్ రాజా చేతికి వచ్చింది.
Also Read: The Warrior Movie Trailer: ‘ది వారియర్’ ట్రైలర్‌లో పవర్ ఫుల్ పోలీస్‌గా ఆకట్టుకున్న రామ్
Also Read: Bimbisara Update: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు.. 'బింబిసార' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook