Akira Nandan Meets Modi: నిన్న మొన్నటి వరకు.. పవన్ కళ్యాణ్ అభిమానులకు మినహా.. మిగతా తెలుగు ప్రేక్షకులకు అకిరా అంటే.. పెద్ద క్రేజ్ ఏమీ లేదు. అకిరా అంటే కేవలం పవన్ కళ్యాణ్ కొడుకుగా మాత్రమే అందరికీ తెలుసు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ తన కొడుకు గురించి ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోపక్క రేణు దేశాయ్ సైతం.. అకిరా సినిమాలకు వస్తారో.. లేదో తనకు తెలియదన్నట్టే మాట్లాడేది. దీంతో అకిరా సినీ ఫ్యూచర్.. ఎవరు పెద్దగా ఆశలు పెంచుకోలేదు. దీనికి తోడు అకిరా.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండకపోవడంతో.. రేణు దేశాయ్ ఫోటోలు షేర్ చేసినప్పుడు మినహా.. ఇక ఎప్పుడూ తన పేరు పెద్దగా వినిపించేది కాదు.


కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల తరువాత.. పవన్ కళ్యాణ్ పేరు ఎంత మారుమొగుతుందో.. అకిరా పేరు కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ గెలిచారు అనగానే.. హైదరాబాదులోని పవన్ నివాసం నుంచి ఒక వీడియో విడుదల అయింది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మూడో భార్య వెనుక నుంచి వచ్చాడు పవర్ స్టార్ రెండో భార్య కొడుకు అకిరా. ఆ వీడియో దగ్గర నుంచి.. సోషల్ మీడియాలో అకిరా గురించి పోస్టుల మీద పోస్టులు పడ్డాయి. ఇంతకుముందు కూడా అకిరా కొన్నిసార్లు కనిపించిన.. ఈ వీడియోలో.. ఈ కుర్రాడు హీరో మెటీరియల్ లాగా కనిపించడంతో.. ఇక పవన్ అభిమానులు ఆ వీడియోని తెగ షేర్ చేశారు.


అయితే కథ అక్కడితో ఆగలేదు.. ఆ తరువాత పవన్.. చంద్రబాబుని కలవటానికి వెళ్ళినప్పుడు.. అకిరాని కూడా తీసుకెళ్లాడు. అక్కడ అకిరా చంద్రబాబు నాయుడు కాళ్లు మొక్కదం కూడా జరిగింది. అయితే అక్కడ అకిరా ప్రవర్తన చూసి.. చాలామంది తను అచ్చం తన తండ్రిలానే అని కామెంట్స్ పెట్టసాగారు. దీంతో సోషల్ మీడియా మొత్తం అకిరా ఫోటోలు.. వీడియోలు వైరల్ కాసాగాయి.


ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తన కొడుకుని తీసుకొని.. పీఎం మోడీని సైతం కలిశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు తన కొడుకు విషయంలో..సైలెంట్ గా ఉన్న పవన్.. ఇప్పుడు కరెక్ట్ టైం తీసుకుని.. తన కొడుకుకి మంచి ఎలివేషన్ ఇస్తున్నారని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ సమయం కోసమే పవన్ ఎదురుచూసుంటారేమో అని.. అందుకే ఇలాంటి కరెక్ట్ సమయంలో కొడుకుని దింపి.. జూనియర్ పవర్ స్టార్ అని రుజువు చేయిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. మొత్తానికి ఈ రెండు రోజుల్లో అకిరా లేవలే మారిపోయింది. ఇదే ఊపులో.. తన కొడుకుని హీరోగా కూడా పవన్ దించుతాడా అనేది ఎంతోమందిలో ఉన్న సందేహం.


Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter