Pawan Kalyan on HCA Awards for RRR పవన్ కళ్యాణ్ తాజాగా రామ్ చరణ్‌, ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్‌ను అభినందించాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు నాలుగు పురస్కారాలు దక్కడం, రామ్ చరణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రజెంటర్‌గా అవార్డుని ఇప్పించడం అందరికీ తెలిసిందే. ఏబీసీ మీడియా, గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ సందడి చేయడం అందరికీ తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాడు. రాజమౌళి, కీరవాణి ఇలా అందరికీ కంగ్రాట్స్ చెప్పాడు పవన్ కళ్యాణ్‌.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా రామ్ చరణ్ గురించి గొప్పదనం చాటి చెప్పేలా ఓ ఫ్యాన్ మేడ్ ఎడిట్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పందెంకోడి పార్ట్ 2లోని ఓ సీన్‌ను ఇప్పుడు ఎడిట్ చేశారు. ఇందులో గురూజి, పవన్ కళ్యాణ్ ముచ్చట్లు పెట్టినట్టుగా చూపించారు. ఈ వీడియో విశాల్ చేసిన ఫైట్ సీక్వెన్స్ గురించి పక్కనే ఉన్న రైట్ హ్యాండ్‌లాంటి వ్యక్తి చెప్పడం, రాజ్ కిరణ్‌ లోలోపల ఉప్పొంగిపోయే సీన్‌ను ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఆపాదించారు.


మొత్తానికి ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా అదే హై లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియోను చూస్తుంటే నిజంగానే త్రివిక్రమ్ అలా మాట్లాడితే.. ఇలానే పవన్ కళ్యాణ్‌ రియాక్ట్ అవుతాడనేలా వీడియోను ఎడిట్ చేశారు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ సైలెంట్‌ అయితే.. మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.


 



హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌ అవార్డు వేడుకల్లో ప్రజంటర్‌గా ప్రత్యేక ఆహ్వానం రావడం, హాలీవుడ్ నటీనటులతో ముచ్చట్లు పెట్టడం, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఆర్ఆర్ఆర్ సినిమాకు నాలుగు అవార్డులు రావడం, గుడ్ మార్నింగ్ అమెరికా వంటి పాపులర్ షోలో రామ్ చరణ్ కనిపించడం వంటివి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


ఇక రామ్ చరణ్‌ సైతం హాలీవుడ్ ప్రాజెక్ట్‌ల చేయాలన్న కోరికను బయటపెట్టేయడం, అక్కడి మేకర్లు సైతం రామ్ చరణ్‌ను తీసుకునే ఆలోచనల్లో ఉన్నారని తెలియడంతో మెగా ఫ్యాన్స్ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడున్న కమిట్మెంట్లు పూర్తయితే హాలీవుడ్‌లో చేయాలన్న కోరికను బయటపెట్టేసిన సంగతి తెలిసిందే.


Also Read:  Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత


Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook