Renu Desai: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్. ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ డిలీట్ !
Renu Desai Instagram: రేణు దేశాయ్ కి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో.. ఒక సమస్య వస్తునే ఉంటుంది. అందుకు ముఖ్య కారణం ఇంకా చాలామంది అభిమానులు రేణు దేశాయ్‌ని పవన్ కళ్యాణ్ భార్యగానే.. చూడడం. ఈ క్రమంలో తన ట్విట్టర్.. ఫేస్ బుక్.. అకౌంట్స్ కూడా డిలీట్ చేసింది ఈ నటి.. ఈ క్రమంలో లేని దేశాలు ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ గురించి పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
Renu Desai Emotional Video: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో.. హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత జానీ సినిమాలో.. కనిపించి మెప్పించింది ఈ హీరోయిన్. తన రెండు సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న రేణు దేశాయ్.. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ఆయనతో విడాకులు తీసుకుంది. కానీ కొంతమంది అభిమానులు మాత్రం ఇంకా రేణు దేశాయిని పవన్ భార్యగానే చూస్తూ ఉంటారు.. అందువల్లని సోషల్ మీడియాలో రేణు దేశాయ్.. కొన్నిసార్లు ఎమోషనల్ గా స్పందిస్తూ ఉంటుంది. దయచేసి తనను పవన్ భార్యగా చూడద్దని.. ఎన్నోసార్లు అభిమానులను రిక్వెస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ గురించి ఒక వార్త ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయానికి వస్తే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల తరువాత.. రేణూ దేశాయ్‌పై ట్రోలర్స్ విరుచుకునిపడుతున్నారు. కొంతమంది అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ.. తనతో పాటు.. తన పిల్లలు ఆద్య, అకిరాలపై కూడా ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.. రేణూ దేశాయ్.
ఇక ఈ అసభ్యకరమైన కామెంట్స్ నుంచి తప్పించుకోవడానికి.. తాను తన సోషల్ మీడియా మధ్యమాలను.. తీసి వేస్తున్నట్టు తెలియజేసింది. తన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ను క్లోజ్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్టు వేసింది రేణూ దేశాయ్. తనపై వస్తున్న అసభ్యకరమైన కామెంట్.. విపరీతమైన ద్వేషం కారణంగా ట్విట్టర్, ఫేస్ బుక్‌లను తొలిగిస్తున్నట్టు.. అయితే తన బాగుకోరుకునే కొంతమంది గొప్ప వ్యక్తులు సలహాలతో.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో మాత్రం అందుబాటులో ఉంటానని తెలియజేసింది.
కాగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ మాత్రం తాను తొలగించలేనని.. అందుకు ముఖ్య కారణం తన సేవాకార్యక్రమాలను కొనసాగించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ని వినియోగిస్తున్నట్టు.. తెలిపారు రేణు దేశాయ్. “పేద పిల్లలకు సహాయం, ప్రమాద కేసులు, మూగ జీవాలకు ఆహారం, కుక్కలకు రక్షణ,వాటికి వైద్య సదుపాయం లాంటి ఎన్నో సేవల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తానని. ఇన్ బాక్స్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందుకే ఇన్స్టాగ్రామ్ మాత్రం నేను తొలగించలేను” .. అంటూ తన ఇన్బాక్స్లో ఒక మెసేజ్ ను షేర్ చేస్తూ.. ఎమోషనల్.. పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్..
Read more: Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి