Pawan Kalyan sing a song for Bheemla Nayak Movie?: 'పవర్‌ స్టార్‌' పవన్‌ కల‍్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్‌' (Bheemla Nayak). రానా దగ్గుబాటితో కలిసి పవన్ నటిస్తున్న ఈ మల్టీసారర్‌ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమా రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. మలయాళంలో బిజు మీనన్ నటించిన పాత్రలో పవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో రానా నటిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న భీమ్లా నాయక్‌ విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే భీమ్లా నాయక్‌ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్‌, పాటలు, గ్లింప్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 'అడవి తల్లి మాట' అనే టైటిల్‌తో రూపొందిన పాట ఈ రోజు రిలీజ్ కాగా.. శ్రోత‌ల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ బయటికొచ్చింది. పవన్‌ కల‍్యాణ్‌ ఈ సినిమాలో ఓ పాట పాడారని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట వైరల్ అవ్వడమే అందుకు బలం చేకూర్చుతుంది. ఫొటోలో క‌నిపిస్తున్న సెటప్ చూస్తుంటే.. పవర్‌ స్టార్‌ కచ్చితంగా పాత పాడినట్టుగానే అనిపిస్తుంది. పవన్ పాడిన పాటను సినిమా రిలీజ్ కావడానికి రెండ్రోజుల ముందు విడుదల కానుందని సమాచారం. 


Also Read: Lizard: 7వేల కి.మీ ప్రయాణించిన బల్లి... ఎలా సాధ్యమైందంటే...


పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే చాలా సినిమాల్లో తన గొంతును విపించిన సంగతి తెలిసిందే. తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, పంజా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి మరియు కాటమరాయుడు లాంటి సినిమాల్లో పవన్ పాటలు పాడారు. పవర్‌ స్టార్‌ పాడిన పాటలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. తమ్ముడు, ఖుషి, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది సినిమాల్లో అతడు పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. మరి భీమ్లా నాయక్‌ చిత్రంలో ఎలాంటి సాంగ్ పాడారో తెలియాలంటే కొన్నిరోజులు వేచిచూడాల్సిందే. 


Also Read: Laxmi Raai Breakup: ధోనితో బ్రేకప్ మచ్చ తెచ్చిపెట్టింది.. నా లైఫ్‌లో ఎన్నో బ్రేకప్స్ జరిగాయి: లక్ష్మీరాయ్‌


భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) చిత్రంకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మోహన్ రాజా కూడా డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్‌ఎస్ తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం దర్శకనిర్మాతలు జోరు పెంచారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు (Fans) వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook