Vakeel Saab Movie: వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 30 న విడుదల
Vakeel Saab Movie: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినీ పరిశ్రమ మరోసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తోంది. థియేటర్లు ఒక్కొక్క ప్రాంతంలో మూతపడుతుండటంతో ఇప్పటికే విడుదలైన సూపర్ హిట్ సినిమాలు కూడా అదే బాటపడుతున్నాయి.
Vakeel Saab Movie: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినీ పరిశ్రమ మరోసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తోంది. థియేటర్లు ఒక్కొక్క ప్రాంతంలో మూతపడుతుండటంతో ఇప్పటికే విడుదలైన సూపర్ హిట్ సినిమాలు కూడా అదే బాటపడుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)ఒక్కటే కాదు..మొత్తం సినీ పరిశ్రమకు కరోనా మరోసారి కాటేస్తోంది. 2020లో కరోనా మొదటి వేవ్ కారణంగా దాదాపు 7-8 నెలలు థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు నిలిచిపోయాయి. అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ (OTT) వేదికలపై విడుదలయ్యాయి. మరి కొన్ని సినిమాలు థియేటర్లు ప్రారంభమయ్యేవరకూ వేచి చూశాయి. థియేటర్లు తెరిచాక ముఖ్యంగా టాలీవుడ్‌కు బంపర్ హిట్ సినిమాలు రావడంతో మంచి కలెక్షన్లు సాధించారు.
పరిస్థితి బాగుంది..గాడిన పడుతుందనుకునే తరుణంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) దెబ్బకొట్టింది. దేశమంతా కరోనా పరిస్థితులు భయంకరంగా మారడంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే థియేటర్లు (Theatres) మూతపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో ముతపడనున్నాయి. ఈ నేపధ్యంలో సినిమాలు మరోసారి ఓటీటీని ఆశ్రయిస్తున్నాయి. ఇంకొందరు విడుదల వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ( Vakeel saab Movie) సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు పరిస్థితులు మారుతుండటంతో వకీల్ సాబ్ సినిమాను ఓటీటీలో విడుదల చేసే తేదీ నిర్ణయించారు. వాస్తవానికి థియేటర్లలో విడుదలైన 50 రోజుల తరువాత ఓటీటీలో విడుదల చేస్తామని నిర్మాత దిల్‌రాజు (Dil raju) ప్రకటించినా...పరిస్థితులు మారడంతో కాస్త ముందుగానే ఓటీటీలో విడుదల చేయాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 30వ తేదీన వకీల్ సాబ్ విడుదల కానుందని స్వయంగా అమెజాన్ ప్రైమ్ (Amazon prime)వెల్లడించింది.
రాజకీయల్లో ప్రవేశించిన మూడేళ్ల అనంతరం వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు. హిందీ సినిమా పింక్ ( Pink movie) ఆధారంగా వకీల్ సాబ్ రీమేక్ అయింది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన వకీల్ సాబ్‌కు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ ( Shriti Haasan) నటించగా..ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, నివేథా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఉన్నారు.
Also read: Taapsee Pannu: వైరల్ అవుతున్న బాలీవుడ్ నటి తాప్సీ పన్ను కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook