Taapsee Pannu: వైరల్ అవుతున్న బాలీవుడ్ నటి తాప్సీ పన్ను కౌంటర్

Taapsee Pannu: బాలీవుడ్ అగ్రనటి తాప్సీ పన్ను..సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ఎంత స్మైలీగా కన్పిస్తుందో అంతే టఫ్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్పీ సోషల్ మీడియాలో ఓ వ్యక్తికి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ వైరల్ అవుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2021, 05:06 PM IST
Taapsee Pannu: వైరల్ అవుతున్న బాలీవుడ్ నటి తాప్సీ పన్ను కౌంటర్

Taapsee Pannu: బాలీవుడ్ అగ్రనటి తాప్సీ పన్ను..సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. ఎంత స్మైలీగా కన్పిస్తుందో అంతే టఫ్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్పీ సోషల్ మీడియాలో ఓ వ్యక్తికి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా (Social Media) వచ్చాక వాక్ స్వాతంత్ర్యం ఎక్కువైపోయినట్టుంది. ప్రతి ఒక్కరూ ప్రతి అంశంపై కామెంట్లు చేస్తున్నారు. ఉచితమైన సలహాలు ఇవ్వడం, ఇష్టమొచ్చినట్టు తిట్టడం, విమర్శించడం, సూక్తులు వల్లెవేయడం ఇదే పరిపాటిగా మారింది. ప్రముఖ బాలీవుడ్ నటి తాప్సీ పన్నూ(Bollywood Actress Taapsee pannu)కు ఇదే ఎదురైంది. 

కరోనా (Corona virus) కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి సోషల్‌ మీడియా ద్వారా తనకు తోచినంత సాయం చేస్తోంది తాప్సీ. ఆక్సిజన్‌, రెమిడిసివిర్‌ ( Remdesivir) కోసం సంప్రదించాల్సిన నంబర్లను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆమె తీరును తప్పుపట్టాడు. ఇలా ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేసే బదులు నీ కారు ఇవ్వొచ్చు కదా, దానితో వాళ్లు పని చేసుకుంటారు అని కామెంట్‌ చేశాడు. ఇది చూసి చిర్రెత్తిపోయిన తాప్సీ నోరు మూసుకో.. అంటూ మండిపడింది. కరోనాతో కుదేలవుతున్న ఈ దేశం తిరిగి సాధారణ స్థితికి వచ్చేవరకు నోరు విప్పవద్దని హెచ్చరించింది. తన విలువైన సమయాన్ని ఇలాంటి చెత్త మెసేజ్‌లతో వృధా చేయొద్దని కోరింది. తానేం చేయాలనుకుంటున్నానో దాన్ని చేయనివ్వండని కోరింది. సోషల్ మీడియాలో తాప్సీ ఆ వ్యక్తికి ఇచ్చిన ఈ కౌంటర్ ( Taapsee Strong counter) ఇప్పుడు వైరల్ అవుతోంది.

సాధారణంగా సెలెబ్రిటీలు ఇలాంటి వ్యాఖ్యలు చేసే బ్యాచ్‌ను పట్టించుకోరు. కానీ ఎప్పుడైనా శృతి మించారన్పిస్తే మాత్రం కౌంటర్ ఇచ్చేస్తుంటారు. తాప్సీ కూడా అంతే. సాధారణ నెటిజన్లకే కాదు ఇతర సెలెబ్రిటీలకు కూడా కౌంటర్ ఇస్తుంటోంది.

Also read: Ramu Passes Away: కరోనాతో ప్రముఖ నిర్మాత, Actress Malashree భర్త రాము కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News