RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?
Pawan Kalyan still not Tweet about RRR Movie. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల అయి నాలుగు రోజులైనా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు.
Pawan Kalyan still not Tweet about RRR Movie: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్'. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త కథతో జక్కన ఈ మూవీని రూపొందించారు. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్.. గత శుక్రవారం (మార్చి 25) రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఆర్‌ఆర్‌ఆర్ మేనియానే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాజమౌళి పనితీరు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన బాగుందని కొనియాడారు. అయితే కొంతమంది తెలుగు స్టార్స్ ఇపటివరకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఆ జాబితాలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ 'బాహుబలి' సినిమాని చాలాసార్లు బహిరంగానే ప్రశంసించారు. భారతీయ బాక్సాఫీస్‌పై తెలుగు సినిమాలు సత్తాచాటుతున్నాయన్నారు. తెలుగు ప్రజలు గర్వించేలా చేసినందుకు ఎస్‌ఎస్ రాజమౌళిని పవన్ ప్రశంసించారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల అయి నాలుగు రోజులైనా.. పవర్ స్టార్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఇందుకుకారణం లేకపోలేదు. ఆర్‌ఆర్‌ఆర్ విడుదలకు ఒక వారం ముందు వరకు పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉన్నారు. మీటింగ్స్, సమావేశాలతో పాల్గొని బిజీ అయిపోయారు.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పాన్ ఇండియా ఈ సినిమాని చూస్తారని, ట్వీట్ కూడా చేస్తారని చాలా మంది భావించారు. అయితే అలా జరగలేదు. పవన్ బిజీగా ఉన్న కారణంగానే సినిమా చూడలేదని తెలుస్తోంది. త్వరలోనే పవర్ స్టార్ ఈ సినిమా చూసి తన అభిప్రాయం చెపుతారని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ తాజా చిత్రం 'బీమ్లా నాయక్' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
Also Read: Petrol price Today: సామాన్యులపై మళ్లీ పెట్రో వాత.. 7 రోజుల్లో ఆరోసారి ధరల పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook