Raj Tarun Lavanya Controversy: హీరో రాజ్ తరుణ్ లావణ్యల కాంట్రవర్సీ.. రోజురోజుకీ పెద్దది అవుతూ వస్తోంది. 11 ఏళ్లుగా తనని ప్రేమించి మోసం చేశాడు అని ఇప్పుడు తన తిరగబడరా సామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో.. తిరుగుతున్నాడు అని లావణ్య పోలీసు కేసు నమోదు చేసిన.. సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజ్ తరుణ్ ఇప్పుడు తన ఫోన్ కూడా ఎత్తడం లేదు అని..మరోవైపు మాల్వి నుంచి తనకి ప్రాణహాని కలిగే అవకాశం కూడా ఉంది అంటూ.. లావణ్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. ఈ వివాదంలో రోజుకి ఒక కొత్త మలుపు వస్తూ ఉంది. 


తాజాగా ఇప్పుడు ఈ వివాదం.. పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళబోతున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. తనకి న్యాయం చేయమని.. లావణ్య పవన్ కళ్యాణ్ ను కోరతానని మీడియా ముఖంగా.. చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు కానీ రాజ్ లాగా చేయలేదు అంటూ లావణ్య చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.


"నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. అందుకే రాజ్ తరుణ్ నన్ను వదిలేసి పారిపోయాడు అని నాకు న్యాయం చేయమని ఆయనని అడగాలని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఆయన ఎప్పుడూ తన భార్యలకి ప్రాధాన్యత ఇచ్చారు. తన బాధ్యతలను ఎప్పుడు వదులుకోలేదు. రాజ్ నాకు కనీసం తిండికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు" అంటూ లావణ్య మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. 


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీస్ కేసు నమోదు చేసిన లావణ్య.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను సహాయం కోరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ దాకా ఈ విషయం వెళితే అది ఇంకా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 


ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ కెరియర్ మీదే దెబ్బ పడే.. అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో లావణ్యకి.. న్యాయం జరిగేలా చూస్తారా లేదా వేచి చూడాలి.


Also Read: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..


Also Read: Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి