Pawan Kalyan Unstoppable Episode Date: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వీడియో యాప్ లో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక సీజన్ విజయవంతంగా పూర్తి కాగా రెండవ సీజన్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. తాజాగా ఈ సీజన్ కి సంబంధించిన చివరి ఎపిసోడ్ గా చెబుతున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ఆహా యాజమాన్యం ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా ఈ మేరకు మరో అప్డేట్ కూడా ఇచ్చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి భాగం స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటూ అప్డేట్ ఇచ్చింది. మాటల్లో రోషం, మీసంలో పౌరుషం, ఆ కటౌట్ లో రాజసం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ అఫియరెన్స్ కి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి మూడో తేదీన మొదటి ఎపిసోడ్ మీ ముందుకు రాబోతోంది అంటూ ఆహా వీడియో ప్రకటించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్ మీద అందరిలోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి.


దానికి కారణం నందమూరి మెగా కుటుంబాల మధ్య ఇదివరకు తీవ్ర ఆధిపత్య పోరు ఉండేది. అయితే తర్వాత కాలంలో ఈమధ్య కాస్త స్నేహ సంబంధాలు ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి. అది కాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ స్థాపించి ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు.


తర్వాత ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు, ఈసారి మరోసారి తెలుగుదేశం జనసేన పొత్తులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మీద అందరిలో ఆసక్తి నెలకొంది. కేవలం సినీ అభిమానులు మాత్రమే కాదు పాలిటిక్స్ ఫాలో అయ్యేవారు సైతం ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో నందమూరి బాలకృష్ణ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు చెబుతారా అని ఎదురు చూస్తున్నారు. అయితే షోలో ఎలాంటి వివాదాస్పద ప్రశ్నలు, సమాధానాలు ఉండవు అని తెలిసినా సరే ఈ ఎపిసోడ్ కోసం పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
Also Read: Top Music directors : మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన.. మ్యూజిక్ డైరెక్టర్లు ఒంటబట్టించుకుంటేనే మంచిది!


Also Read: Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరో.. రుణపడి ఉంటామంటున్న అభిమానులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook