Pushpa 2 Update:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోసారి అటు పవన్ కళ్యాణ్ కి.. ఇటు అల్లు అర్జున్ కి  మధ్య టఫ్ ఫైట్.. ఉండబోతుందని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్..  పుష్ప సీక్వెల్ పుష్ప 2 తో డిసెంబర్ 6న రాబోతున్న విషయం తెలిసిందే. మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు సినిమాకి.. మూడు వారాల డేట్స్ ఇస్తే డిసెంబర్ లో విడుదల అవుతుందని నిర్మాతలు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలు ఒకేసారి రావచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో.. ఆయన తీయాల్సిన సినిమాలు అటకెక్కాయి. మొన్నటి వరకు కనీసం వారం రోజులైనా సినిమాకి కేటాయించే వాళ్ళు .. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. కనీసం తన చేతిలో సినిమా కోసం రెండు రోజులు కూడా..  కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. 


అందుకే ఇప్పుడు అభిమానులలో కనీసం తన చేతిలో ఉన్న మూడు సినిమాలైనా పూర్తి చేస్తారా?  అనే ప్రశ్న మొదలైంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు మూడు వారాలు కేటాయించాలి. ఈ మూడు వారాలు కేటాయిస్తే ఈ సినిమాని ఎలాగైనా త్వరగా విడుదల చేయొచ్చు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతలు.. అక్టోబర్ లోపే ఈ సినిమాని పూర్తి చేసి ఇస్తామని.. సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ కి అమ్మేసి.. అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో అమెజాన్ తో మాట్లాడి డిసెంబర్ వరకు టైం తీసుకుని షూటింగ్ పూర్తి చేసి ఎలాగైనా సరే.. హరిహర వీరమల్లు సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నారు అని సమాచారం. 


ఇటీవల హరిహర వీరమల్లు నిర్మాత ఏ ఏం. రత్నం కూడా ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆగస్టు చివరి వారంలో డేట్స్ ఇస్తే.. డిసెంబర్లో సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. మరొకవైపు ఆగస్టు 15వ తేదీ నుంచి.. పుష్ప 2సినిమా విడుదల తేదీని డిసెంబర్ 6 కి మార్చారు. దీంతో వారం రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. దీంతో మరొకసారి వీరిద్దరి మధ్య సినిమా విషయంలో టఫ్ ఫైట్ జరగనుంది. మరి ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.


Also Read: NTR Bharosa Scheme: జగన్‌, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?


Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter