Oosaravelli Actress Payal Ghosh Sensational Comments on Jr NTR & South Film Industry: బెంగాలీ నటి పాయల్ ఘోష్ గురించి తెలుగు వారికి కూడా బాగానే పరిచయమే. ఎందుకంటే ఆమె తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. నిజానికి బీబీసీ తెరకెక్కించిన ఒక ఇంగ్లీష్ సినిమా ద్వారా పరిచయమైన ఆమె ఆ తర్వాత ఏడాదిలోనే మంచు మనోజ్ సరసన ప్రయాణం అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత ఒక కన్నడ సినిమాలో కూడా నటించింది కానీ ఆమెకు తగిన క్రేజ్ అయితే లభించలేదు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2011లో ఊసరవెల్లి సినిమాలో ఆమె చిత్ర అనే పాత్రలో నటించింది, తమన్నా స్నేహితురాలి పాత్రలో ఆమె తెలుగు వారందరికీ పరిచయం అయి పోయింది. అదే ఏడాది మిస్టర్ రాస్కెల్ అనే సినిమాలో కూడా ఆమె నటించింది కానీ ఆమెకు ఎందుకో అనుకున్నంత క్రేజ్ అయితే దక్కలేదు. దీంతో టెలివిజన్ రంగంలో ప్రవేశించిన ఆమె చాలా కాలం పాటు ఒక సీరియల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకు మళ్ళీ హిందీ సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి, అలా హిందీలో 2017 లో ఆమె ఒక సినిమా చేసింది . కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చి పెట్టలేక పోయింది. ఇక ఆ తరువాత ఆమె చాలా కాలం పాటు సైలెన్స్ పాతింది.


అయితే ఎప్పుడైతే ఆమె అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడు అంటూ కేసు పెట్టిందో అప్పటినుంచి ఒక్కసారిగా లైమ్ లైన్ లోకి వచ్చేసింది. ఇక అప్పటినుంచి ఏదో ఒక విధమైన కామెంట్లు చేస్తూ వస్తున్న ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. తాను సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు నేషనల్ అవార్డు సాధించిన దర్శకులతో స్టార్ డైరెక్టర్లతో పని చేశాను కానీ ఎవరు నన్ను అసభ్యకరంగా కూడా టచ్ చేయలేదని పేర్కొన్నారు. కానీ బాలీవుడ్ లో నేను అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయలేదు, కానీ మా మూడవ మీటింగ్ లోనే అతను రేప్ చేశాడు.


ఇప్పుడు చెప్పండి నేను సౌత్ సినిమా పరిశ్రమను ఎందుకు పొగడ కూడదు అంటూ ఆమె ప్రశ్నించింది. అలాగే ఆమె తాను జూనియర్ ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్ తో కూడా పని చేశానని ఆయన కూడా తనతో ఎప్పుడూ అసభ్యకరంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ చాలా జెంటిల్మెన్ అని అందుకే తనకు సౌత్ సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టం అని ఆమె పేర్కొంది. ఇక పొలిటికల్ సపోర్ట్ కోసం ఈ భామ కేంద్ర అమంత్రి రామ్ దాస్ అథవాలేకి చెందిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయి ఆ పార్టీ ఉమెన్ వింగ్ కు వైస్ ప్రెసిడెంట్ గా కూడా అపాయింట్ అయింది. 


Also Read: Ram Charan on RC16: రంగస్థలాన్ని మించి బుచ్చిబాబు సినిమా.. హాలీవుడ్ రేంజ్ అంటున్న రామ్ చరణ్!


Also Read: Sir Closing Collections: సార్ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook