'SIR' Movie Closing Collections: హీరో ధనుష్ 'సార్' మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే..?

;Sir' Movie Closing Collections: ధనుష్ హీరోగా సార్ అనే సినిమా తెలుగులో రిలీజ్ అయి మార్చి 17వ తేదీ నుంచి  నెట్ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది, ఈ క్రమంలో క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.   

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 19, 2023, 11:30 AM IST
'SIR' Movie Closing Collections: హీరో ధనుష్ 'సార్' మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే..?

'SIR' Movie Closing Collections: ధనుష్ హీరోగా సార్ అనే సినిమా తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అదే సినిమాని తమిళంలో వాతి పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో హారిక హాసిని బ్యానర్ మీద నిర్మితమైన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా  నటించగా సముద్రఖని విలన్ పాత్రలో నటించారు.

విద్య గొప్పతనం గురించి సాగిన ఈ సినిమా ప్రేక్షకులు అందరినీ విప్పించడమే కాక థియేటర్లకు సైతం రప్పించింది, ఈ సినిమా విడుదలై నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. తాజాగా మార్చి 17వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది, తెలుగులో సార్ తమిళంలో వాతి రెండు వర్షన్లు  నెట్ఫ్లిక్స్ లోనే అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతవరకు వచ్చాయి అనే విషయం మీద ఒకసారి లుక్కు వేసే ప్రయత్నం చేద్దాం.

ముఖ్యంగా ఈ సినిమా తెలుగు వర్షన్ కి నాలుగు వారాల్లో నైజాం ప్రాంతంలో ఎనిమిది కోట్ల 93 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది సిడెడ్ ప్రాంతంలో మూడు కోట్ల 15 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు కోట్ల 34 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 93 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల నాలుగు లక్షలు, గుంటూరు ప్రాంతంలో కోటి 63 లక్షలు, కృష్ణాజిల్లాలో కోటి 49 లక్షలు, నెల్లూరు జిల్లాలో 81 లక్షలు వెరసి మొత్తం 22 కోట్ల 32 లక్షల షేర్ 42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.  

ఇక అదే విధంగా కర్ణాటక సహా మిగతా భారతదేశం అలాగే ఓవర్సీస్ లో కోటి 40 లక్షలు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ కి 23 కోట్ల 72 లక్షల షేర్ 45 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక తమిళం కూడా కలుపుకుంటే ఈ సినిమా 118 కోట్ల 37 లక్షల గ్రాస్ 61 కోట్ల 71 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. అలా మంచి వసూళ్లు సాధించి ధనుష్ కెరీర్ లోనే ఇప్పటివరకు తెలుగులోనే కాదు తమిళంలో కూడా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే సార్  6.7 కోట్ల టార్గెట్ మీద బరిలోకి దిగి 17.02 కోట్ల ప్రాఫిట్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద బరిలోకి దిగి 25.71 కోట్ల ప్రాఫిట్ అందుకుంది. ఇక వీటికి నాన్ థియేట్రికల్ రైట్స్ అదనం.

Also Read: Rashmi Gautam Photos: బ్యాక్ కనిపించేలా రష్మీ గౌతమ్ హాట్ ట్రీట్.. చీరకట్టులోనూ కాక రేపుతోందిగా!

Also Read: Nivetha Pethuraj Saree: ఉల్లిపొర లాంటి చీరలో సెగలు రేపుతున్న నివేదా.. అందాలతోనే ధమ్కీ ఇస్తోందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

 

Trending News