Trolls on Payal Rajput సోషల్ మీడియాలో మంచి కంటే ఎక్కువగా చెడు ఉంటుంది. మంచి పని చేసినా కూడా వంకర కామెంట్లు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఇక సెలెబ్రిటీల మీద ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. పాయల్ రాజ్‌పుత్ మీద అయితే ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు వినిపిస్తుంటాయి. పాయల్ మీద ఒకప్పుడు దారుణమైన ట్రోలింగ్ జరిగేది. ఇప్పుడు కాస్త తగ్గిందని అనుకుంటూ ఉంటే మళ్లీ ట్రోలింగ్ మొదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాయల్ రాజ్‌పుత్ కరోనా టెస్టు చేసుకున్న సమయంలో ఓవర్ యాక్షన్ చేసిందని, కావాలనే అలా అరుస్తోందని, అది పబ్లిసిటీ స్టంట్ అని అందరూ ట్రోల్ చేశారు. కానీ తనకు అది భయం అని, దానికి కూడా అలా ట్రోల్ చేయాలా? అంతగా నెగటివ్ కామెంట్లు పెట్టాలా? అంటూ పాయల్ ఆవేదన వ్యక్తం చేసింది.


 



ఇక మరో సందర్భంలో పాయల్ తన ప్రైవేట్ పార్ట్ కనిపించేలా ఫోటో షూట్ చేసింది. దీంతో మళ్లీ పాయల్‌ను ఆడేసుకున్నారు. ఎవ్వరికీ లేనిది తనకు ఉందా? కావాలని జరిగిందా? పొరబాటున జరిగితే ఇలా చేస్తారా? అంటూ పాయల్ ట్రోలర్లకు గట్టిగా బదులు ఇచ్చింది. మీరు ఇలా ట్రోల్ చేయడం వల్ల డిప్రెషన్‌కు లోనవుతున్నాను అంటూ పాయల్ బాధపడింది.


ఇప్పుడు పాయల్ మీద ట్రోలింగ్ జరగడానికి ఓ కారణం ఉంది. పాయల్ ప్రేమగా.. ఓ ఆవుకు ఫుడ్ పెడుతోంది. జంతువులను ప్రేమించడం ఆపకండి.. ఎందుకంటే అవి మనకు సంతోషాన్ని ఇస్తాయ్.. జంతువులని ప్రేమించి మీలోని మంచిని తట్టి లేపండి అన్నట్టుగా పోస్ట్ వేసింది.


దీంతో నెటిజన్లు తిరగబడ్డారు. అయితే కోళ్లు, మేకలను తినడం ఆపేయ్.. ముందు చికెన్ మటన్ మానేయ్.. అవి కూడా జంతువులే కదా? వాటిని ఎందుకు తింటున్నావ్.. నీది అంతా కూడా ఓవర్ యాక్షన్ అంటూ జనాలు ఆమెను ఆడేసుకుంటున్నారు.


Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?


Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి