Peka Medalu Trailer Launch Event: వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘పేక మేడలు’. ఈ సినిమాను క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. గతంలో ఈ బ్యానర్ లో తెరకెక్కిన ‘ఎవరికీ చెప్పొద్దు’ అనే క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మించారు. తాజాగా ‘పేక మేడలు’ మూవీతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను నుంచి విడుదల చేసిన టీజర్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఢిఫరెంట్ ప్రమోషన్స్ తో చేస్తున్న ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఈ నెల 19న ‘పేక మేడలు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ..
మీడియా మిత్రులు సమక్షంలో  ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం  చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకి ఆధారంగా  సినిమాను చూపించబోతున్నాము. ఈ సినిమాలో ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ని కూడా  ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.ఈ నెల 19న  పేక మేడలు సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపారు.


నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ :
నా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సపోర్ట్ చేస్తోన్న మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో ప్రమోషన్ సక్సెస్ అయింది. ఇంకా మూవీ రిలీజ్ వరకు ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటామన్నారు.  ఇది ఒక కామెడీ సినిమా కాదు.. ప్రేక్షకులను ఎమోషన్ తో కనెక్ట్ అవుతారు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.


హీరో వినోద్ కిషన్ మాట్లాడుతూ..
తెలుగులో హీరోగా ఇది నా ఫస్ట్ మూవీ. నన్ను కథానాయకుడిగా  సెలెక్ట్ చేసుకున్న నా డైరెక్టర్ నీలగిరికి,  ప్రొడ్యూసర్ రాకేష్ వర్రేకి ప్రత్యేక  కృతజ్ఞతలు. ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీడియా ఇస్తున్న సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇదేవిధంగా సినిమా కూడా చూసి సపోర్ట్ చేయాలని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు.


నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్, టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్,నిర్మాత: రాకేష్ వర్రే,రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల,
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: హరిచరణ్ కె, లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్, పీఆర్వో..మధు, ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ,సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి


Also read: Mumbai Red Alert: వరద గుప్పిట్లో ముంబై, రానున్న 24 గంటల్లో జల ప్రళయం విరుచుకుపడనుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook