Naga Chaitanya Role In Laal Singh Chaddha: యువ సామ్రాట్ నాగచైతన్య ‘జోష్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అనతికాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. లవ్ స్టోరీ సినిమాలు చేస్తూనే నటనకు అధిక ప్రాధాన్యం లభించే సినిమల్లోనూ నటించి మెప్పించాడు. త్వరలో బాలీవుడ్ తెరపై కనిపించనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ సినిమాను బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా అభిమానులు పిలుచుకునే నటుడు ఆమీర్ ఖాన్ (Bollywood Actor Aamir Khan) ప్రధాన పాత్రలో హిందీలో ‘లాల్ సింగ్ చద్దా’గా రాబోతోంది. ఇందులో టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య సైతం ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. లాల్ సింగ్ చద్ధాతో చైతూ హిందీ చిత్రసీమకు పరిచయం కాబోతున్నాడు. గురువారం షూటింగ్‌లో పాల్గొనగా శుక్రవారం నాడు లాల్ సింగ్ చద్దా మూవీ యూనిట్ షూటింగ్ స్పాట్ నుంచి ఒక్క ఫొటో వదిలారు. ఆమీర్ ఖాన్, నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్లుగా కనిపించబోతున్నారు.


Also Read: RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీలో మార్పు లేదా..అక్టోబర్ 13నే విడుదలా



అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం నాగచైతన్య (Actor Naga Chaitanya) శిక్షణ సైతం తీసుకున్నాడు. ఆమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధిక చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల నటి సమంత ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టగా, తాజాగా నాగ చైతన్య మూవీతో హిందీ చిత్రసీమకు పరిచయం కానున్నాడు. దాదాపు మూడు వారాలపాటు రెగ్యూలర్ షూటింగ్‌లో చైతూ పాల్గొననున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది. 


Also Read: Arjun Sarja: హనుమాన్ టెంపుల్ నిర్మించిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, Hanuman Temple Photos


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook