Evo Evo Kalale Song: లవ్ స్టోరీ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

Evo Evo Kalale Song From Love Story Movie | ఫ్యామిలీ, యూత్, లవ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ ‘లవ్ స్టోరీ’ని తీసుకొస్తున్నాడు. ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 25, 2021, 03:20 PM IST
  • నాగ చైతన్య, ఫిదా హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న మూవీ ‘లవ్ స్టోరీ’
  • టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది
  • లవ్ స్టోరీ నుంచి ఏవో ఏవో కలలే సాంగ్‌ను రిలీజ్ చేసిన హీరో మహేష్ బాబు
Evo Evo Kalale Song: లవ్ స్టోరీ నుంచి లేటెస్ట్ అప్‌డేట్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

Evo Evo Kalale Lyrical​​ Video Song: టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారబ్బాయి నాగ చైతన్య, ఫిదా హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న మూవీ ‘లవ్ స్టోరీ’. ఫ్యామిలీ, యూత్, లవ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ ‘లవ్ స్టోరీ’ని తీసుకొస్తున్నాడు.

ఈ మూవీలో ప్రతిపాట వైరల్ అవుతోంది. ఇటీవల విడుదలైన సారంగ దరియా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో లవ్ స్టోరీ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఈ సినిమా నుంచి ‘ఏవో ఏవో కలలే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ఈ పాటల్ని మనకు అందిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

Also Read: Saranga Dariya​​ Video Song: సెన్సేషన్‌‌గా మారిన సాయిపల్లవి సారంగ దరియా సాంగ్

టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల సాహించిన అందించిన ‘ఏవో ఏవో కలలే’ సాంగ్‌ను జోనితా గాంధీ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. పవన్ సీహెచ్ లవ్ స్టోరీ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇటీవల  Love Story Movie నుంచి ‘సారంగ దరియా’ సాంగ్‌ను నాగచైతన్య భార్య, స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుదల చేయగా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. 

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా లవ్ స్టోరీ సినిమాను నిర్మిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ మూవీ ఏప్రిల్ 16వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదిత్య మ్యూజిక్ అందిస్తున్న లవ్ స్టోరీ పాటలను అంతే ప్రేమగా విని ఆస్వాదిస్తారని మూవీ యూనిట్ ధీమాగా ఉంది.

Also Read: Naga Chaitanya ‘లవ్ స్టోరీ’ టీజర్ వచ్చేసింది 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x