MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా రసవత్తరంగా సాగుతాయి. ప్రచారం, హామీలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వర్గాలు ఇలా రాజకీయం వేడెక్కిపోతుంటుంది. ఈసారి ప్రముఖులు బరిలో ఉండటంతో మరోసారి మా ఎన్నికల్లో వేడి రాజుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ (Telangana)రాష్ట్రంలోని హైదరాబాద్‌లో మా ఎన్నికలు వచ్చాయంటే చాలు మొత్తం మీడియా దృష్టి అటే ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజకీయపార్టీల ఎన్నికల్ని తలపిస్తుంటాయి. వాస్తవానికి మా సభ్యుల సంఖ్య కేవలం 465 మాత్రమే. కానీ ఎన్నికలు మాత్రం నియోజకవర్గ ఎన్నికల స్థాయిలో జరుగుతాయి.కేవలం 465 ఓట్లలో ఆధిక్యత కోసం జరిగే పోరు అంతా ఇంతా కాదు. ప్రచార పర్వం, నామినేషన్లు, హామీలు, ఆరోపణలతో తెలుగు సినీ పరిశ్రమ వేడెక్కిపోతుంది. కుల, వర్గ రాజకీయాలు ఉండనే ఉంటాయి.


ఈసారి మా ఎన్నికల్లో(MAA Elections)బరిలో ఉండేవారిలో ప్రముఖుల పేర్లు విన్పిస్తుండటంతో రసవత్తరంగా మారింది పరిస్థితి. ఈసారి మా ఎన్నికల బరిలో మోహన్ బాబు (Mohan Babu)చక్రం తిప్పుతారనే వాదన విన్పిస్తోంది.మంచు విష్ణు(Manchu Vishnu) రంగంలో దిగడంతో వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. మరోవైపు జీవిత రాజశేఖర్(Jeevitha Raja sekhar) బరిలో దిగనుండటం, కొత్తగా నటి హేమ(Actress Hema)కూడా పోటీ చేస్తానని చెప్పడంతో మా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. వర్గాలు, కులాల సమీకరణాలకు తోడు..పింఛన్ హామీలు, సినిమా అవకాశాలు వంటివి ఓటర్లను ప్రలోభపెట్టనున్నాయి.ఇదంతా ప్రతిసారీ జరిగే వ్యవహారమే అయినా ఈసారి మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, హేమ, ప్రకాష్‌రాజ్(Prakash Raj)పేర్లు విన్పిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


Also read: LOL Salaam Title Song: దేవిశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా లాల్ సలామ్ టైటిల్ సాంగ్ రిలీజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook