Poonam Kaur - Trivikram: సినిమా ఇండస్ట్రీలో కొంత మంది తమ నటనతో పేరు తెచ్చుకుంటే.. మరొకరు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈ రెండో కోవకు చెందిన వాళ్లలో పూనమ్ కౌర్ ఒకరు. చేసింది కొన్ని సినిమాలైనా తనదైన వ్యాఖ్యలతో ఎపుడు హాట్ టాపిక్‌గా నిలిస్తుంది. ఇండస్ట్రీలో తనకు సరైన అవకాశాలు దక్కకుండా కొంత మంది దుర్మార్గులు తన సినీ కెరీర్‌ను నాశనం చేసారని ఈమె ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లను టార్గెట్ చేస్తూ ఉంటుంది. అలా పూనమ్ కౌర్ వ్యాఖ్యలకు మీడియాలో ప్రాధాన్యత లభించింది. అంతేకాదు ఈ ఇద్దరి వల్ల బడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చినట్టే వచ్చి చేజారనే విషయాన్ని పలు సందర్బాల్లో ప్రస్తావించడం గమనార్హం. తనకు ధైర్యం ఇచ్చేలా సీత, సావిత్రి, ద్రౌపదిలను తలచుకునేదాన్ని అంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా ఈమె Xలో ఓ దాసరి నారాయణ రావుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో గురువు అనే పదానికి పర్యాద పదంగా నిలిచారన్నారు. ఆయన తన టాలెంట్‌తో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. వేరే స్క్రిప్ట్‌లను ఎపుడు ఆయన  హైజాక్ చేయలేదు. ఇతరులు రాసిన స్క్రిప్ట్‌ పై తన పేరును వేసుకోలేదు అంటూ ఇండైరెక్ట్‌గా త్రివిక్రమ్ గారికి చురకలు వేసాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనవాస్‌ను అందరూ గురూజీ అని మర్యాద పూర్వకంగా పిలుస్తుంటారు. ఈయన గతంలో చేసిన అతడు, అ..ఆ, అజ్ఞాతవాసి, తాజాగా త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలు వేరే వాళ్లు రాసిన స్క్రిప్ట్‌లనే సినిమాలుగా తెరకెక్కించిన విషయాన్ని గుర్తు చేసారు పూనమ్ కౌర్. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళ పూనమ్ కౌర్ జనసేనానిని కాకుండా త్రివిక్రమ్‌ను ఎందుకు టార్గెట్ చేసిందా అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

పూనమ్ కౌర్ విషయానికొస్తే.. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన 'మాయాజాలం' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కథానాయిక పాత్రలను ఒదిలేసి చెల్లెలు పాత్రలను చేయడం మొదలుపెట్టింది.


Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook