Poonam Pandey: ప్రముఖ మోడల్ నటి పూనమ్ పాండే కన్నుమూత.. షాక్‌లో ఫ్యాన్స్..
Poonam Pandey : చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి మోడల్ పూనమ్ పాండే గర్భాశయ కాన్సర్‌తో కన్నుమూయడంతో ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయింది.
Poonam Pandey: ప్రముఖ నటి మోడల్ పూనమ్ పాడే కన్నుమూసారు. ఆమె గత కొన్ని రోజులుగా గర్భాశయ కాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వైవల్ కాన్సర్‌తో ఆమె చనిపోయినట్టు ఆమె సన్నిహితులు అధికారికంగా మీడియాకు తెలిపారు. ఆమె వయసు 32 యేళ్లు. ఎంతో కెరీర్ ఉన్న ఈమె అతి చిన్న వయసులో చనిపోవడం అందరినీ కలిచివేస్తోంది. ఇక నెటింట్లో ఈమె చేసే హాట్ వీడియోలకు కోట్లలో అభిమానులున్నారు. ఆమె చివరి శ్వాస విడిచే సమయంలో ఆమె సొంతూరులోనే ఉన్నారు. పూనమ్ చనిపోయినట్టు ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అందరికీ తెలిసింది. ఇక మృతిపై ఇంకా ఏదైనా అనుమానాలు ఉన్నాయనేది చూడాలి.
బాలీవుడ్ సినిమాల్లో కంటే తన అంగాంగ ప్రదర్శనతో ఈమె పాపులర్ అయింది. ఎప్పుడు కొత్త కొత్త వార్తలతో హెడ్ లైన్స్‌లో ఉండాలని చూడటంలో ఈమె తర్వాతే ఎవరైనా. అప్పట్లో పెళ్లైన 15 రోజుల్లోనే ఈమె తన భర్త సామ్ బాంబే వేధిస్తున్నడంటూ కేసు పెట్టడం అప్పట్లో పెను సంచలనే అయింది. అప్పట్లో క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలిస్తే.. నగ్నంగా టీమ్ ముందు నిలబడి కనువిందు చేస్తానంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. అలా ఈమె పేరు బాగా పాపులర్ అయింది. ఈమె సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. తన సొంత వెబ్‌సైట్లో ఈమె పోస్ట్ చేసే వీడియోలకు కోట్లలో వ్యూస్ రాబట్టి తన కంటూ స్పెషల్ ఐడెంటీటీ ఏర్పరుచుకుంది. ఎపుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండటం పూనమ్ పాండే స్పెషాలిటీ.
పూనమ్ పాండే 11 మార్చి 1991లో ఉత్తర ప్రదేశ్‌లోని కాన్‌పూర్‌లో జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ పాండే.. అప్పట్లో Gladrags Manjunt and Megamodel కంటెస్టెంట్‌కు సంబంధించిన మ్యాగజైన్‌లో ఈమె టాప్ 9లో నిలిచింది. పూనమ్ పాండే ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్స్ అయిన X, ఇన్‌స్టాగ్రామ్‌లో సెమి న్యూడ్ ఫోటోలతో హల్ చల్ చేసేది. 2013లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నషా, ముంబై మిర్రర్ వంటి అర డజనుకు పైగా సినిమాల్లో నటించింది. అటు కొన్న రియాలిటీ షోల్లో పార్టిసిపేట్ చేసి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 1 సెప్టెంబర్ 2020లో సామ్ బాంబేను పెళ్లాడింది. మొత్తంగా కెరీర్ మొత్తం మూడు వివాదాలు.. ఆరు కాంట్రవర్సీలు అన్నట్టుగా సాగిపోయింది. ఏది ఏమైనా ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న ఈమె హఠాత్తుగా కన్నుమూయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదీ చదవండి: Hair Oiling Tips: ఇలా నూనె రాసుకుంటే జుట్టు రాలడం ఖాయం! హెయిర్ ఆయిల్ పెట్టుకునే విధానం ఇలా ఉండాలి..
ఇదీ చదవండి: Side Effect of Paper Cup: మీరూ పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook