pawan kalyan: తెలుగు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పవర్ స్టార్- రానా కలిసి నటిస్తున్న సినిమా టైటిల్ ఖరారైంది. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా టైటిల్ విషయంలో ఎన్నో పేర్లు నెట్టింటా చక్కర్లు కొట్టాయి. ఇప్పడు వాటిన్నంటికీ పుల్ స్టాప్ పెడుతూ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈమేరకు భీమ్లా నాయక్(Bheemla Nayak) అనే పేరు ఖరారు చేసి..ఫస్ట్ గ్లింప్స్(First Glimpse)ను స్వాతంత్ర్యం దినోత్సవం(Independence day) సందర్భంగా రిలీజ్ చేశారు. 


Also Read: Paagal Movie Review: విశ్వక్ సేన్ "పాగల్ " సినిమా రివ్యూ


''ఒరేయ్‌ డేనీ.. బయటకు రారా.. ’ అంటూ పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ‘డేని.. డేనియల్‌ శేఖర్‌’ అని రానా తన పేరు చెప్పగానే.. ‘భీమ్లా..భీమ్లా నాయక్‌.. ఏంటి చూస్తున్నావ్‌.. కింద క్యాప్షన్‌ లేదనా!! అక్కర్లేదు బండెక్కు''’ అంటూ పవర్‌స్టార్‌ వేసిన డైలాగ్‌ అందరితో చప్పట్లు కొట్టించేలా ఉంది. ఇప్పటికే విడుదలైన పవన్‌, రానా ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. 


మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌(Ayyappanum Koshyam)’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌(Pavan Kalyan) భీమ్లానాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. మాతృకలో బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌, పృథ్వీరాజ్‌కుమార్‌ పోషించిన పాత్రలో రానా(Rana Daggubati) కనిపించనున్నారు. నిత్యామేనన్‌(Nithya menon), ఐశ్వర్యా రాజేశ్‌(Aishwarya Rajesh‌) కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్‌(S S Taman) స్వరాలు సమకూరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సెప్టెంబర్‌ 2 నుంచి ‘భీమ్లానాయక్‌(Bheemla Nayak)’ పాటలు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు మూవీమేకర్స్ ప్రకటించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook