Paagal Movie Review: విశ్వక్ సేన్ "పాగల్ " సినిమా రివ్యూ

ఈన‌గ‌రానికిఏమైంది, ఫలక్ నుమా దాస్, HIT వంటి చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ పూర్తిగా లవర్ బాయ్ గా నటించిన చిత్రం "పాగల్". ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి మరీ!!

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2021, 04:32 PM IST
Paagal Movie Review: విశ్వక్ సేన్ "పాగల్ " సినిమా రివ్యూ

చిత్రం: పాగల్‌
నటీనటులు: విశ్వక్‌ సేన్‌, నివేదా పేతురాజ్, సిమ్రన్‌ చౌదరీ, మేఘలేఖ, మురళీశర్మ, తదితరులు...
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్‌
సంగీతం: రాధన్‌
దర్శకుడు: నరేశ్‌ కొప్పిలి
నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా

కరోనా లాక్ డౌన్ తరువాత సినిమా థియేటర్లు మూత పడటంతో, పెద్ద హీరోలు ఎవరు సినిమాను విడుదల చేయకపోవటంతో చిన్న సినిమాలు ధైర్యంగా ముందుకు వస్తున్నాయి. అలా వచ్చిన సినిమానే "పాగల్" (Paagal). ఈన‌గ‌రానికిఏమైంది (E nagaraniki emaindi), ఫలక్ నుమా దాస్ (Falaknuma Das), HIT వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ (Vishwak Sen) పూర్తి లవర్ బాయ్ గా తెరకెక్కిన చిత్రం "పాగల్". 

Read Also: VIral Video: ప్రముఖ నటి ప్రైవేటు వీడియో లీక్... క్షణాల్లో వైరల్

కథ: అమ్మ అంటే అమీతమైన ప్రేమ ఉన్న ప్రేమ్ (విశ్వక్ సేన్), క్యాన్సర్ కారణంగా చిన్నతనంలోనే అమ్మని (భూమిక) కోల్పోతాడు. ఎవరినైతే నిజాయితిగా ప్రేమిస్తామో వాళ్లు కూడా మనల్ని నిజాయితిగా ప్రేమిస్తారని తల్లి చెప్పటంతో, అమ్మాయిని ప్రేమిస్తే అమ్మ లాంటి ప్రేమ దొరుకుతుందని భావిస్తాడు. అలా కనపడ్డ అమ్మాయిలందరికీ ఐ లవ్ యూ చెప్తూ, నిజమైన ప్రేమను వెతుక్కుంటూ ఉంటాడు ప్రేమ్. అలా హైదరాబాద్ లో  ఐ లవ్ యూ చెప్పినా ఏ అమ్మాయి అంగీకరించకపోవటంతో, వైజాగ్ వెళ్లి అక్కడ అమ్మాయిల వెనకాలా పడటం మొదలెడతాడు. అక్కడ కూడా కొన్ని కారణాల వల్ల బ్రేకప్స్ జరుగుతాయి. తిరిగి హైదరాబాద్ వచ్చిన ప్రేమ్ రాజకీయ నాయకులు రాజారెడ్డి (మురళీ శర్మ) వెంట ప్రేమ అంటూ వెంటపడతాడు. ఒకానొక సందర్భంలో రాజారెడ్డిని కాపాడిన ప్రేమ్ వద్దకు చేరుకోగానే అనుకోని షాక్ ఎదురవుతుంది. ఏంటా షాక్? ప్రేమ్ ఎవరు? అతడికి ప్రేమ్ మధ్య సంబంధం ఏంటి ? (నివేదా పేతురాజ్‌) ఎవ‌రు? ప్రేమ్ కి తల్లి చెప్పినట్టుగా నిజమైన ప్రేమ దొరుకుతుందా ? ఇవన్ని ప్రశ్నలకు సమధామ తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరీ!

ఎలా ఉందంటే: 
ఈ సినిమాతో న‌రేశ్ కుప్పిలి ద‌ర్శ‌కుడిగా పరిచయ్యం అయ్యాడు. ప్రేమ్ క్యారెక్టర్ కు విశ్వక్ సేన్ కరెక్ట్ గా సూట్ అయ్యాడు.. ఫస్టాఫ్ లో హీరో అంతా అమ్మాయిల ఐ ల‌వ్ యూ చెప్తూ వెంట పడటం, అమ్మాయిలు రిజెక్ట్ చేయటం, వంటి సన్నీవేశాలున్నా, మేఘా లేఖ‌(Meghalekha) , సిమ్రాన్ చౌద‌రిలు (Simran Choudhary) రిజెక్ట్ చేసేపుడు వచ్చే కొన్ని సీన్స్ అందులో కాచ్చే కామెడీ ఎంజాయ్ చేయవచ్చు.  మధ్య మధ్యలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna)& గ్యాంగ్ చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇలా జరుగుతూ ఉండగానే ట్విస్ట్ వెంటనే ఇంటర్వెల్ పడతాయి. 

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ముందే తెలిసిన ట్విస్ట్ తో తరువాత ఏం జరగపోతుందో అనే విషయం ఓ సగటు సినిమా అభిమానికి తెలిసిపోతుంది. సెకండాఫ్ లో  నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj), మిగలిన కథ అంతా తనచుట్టునే తిరగటం, ముందు తనకు ఐ లవ్ యూ చెప్పటం, ఆమె నిరాకరించటం, తరువాత హీరోయిన్ సరే అనటం.. అక్కడి నుండి లవ్ ట్రాక్ నడుస్తుంది. చివరగా విలన్ ఎవరు అని తెలియటం.. వీళ్ళేనా అని అని పించటం.. అన్ని కలిపి 'పాగల్' ఒక  రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనిపిస్తుంది. 

Also Read: Allu Arjun Movie Update: అంచనాలు పెంచేసిన "దాక్కో దాక్కో మేక సాంగ్"!

నటీనటుల విషయానికి వస్తే..  సినిమా అంత విశ్వక్ సేన్ (Vishwak Sen) పైన నడుస్తుంది. నిజమైన ప్రేమకోసం పరితపించే ప్రేమికుడిగా, కనపడ్డ ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తూ, చివరకి తనకు కావాల్సిన ప్రేమ దూరం అయ్యేపుడు భాధపడే యువకుడిగా విశ్వక్ సేన్ నటన ఆకట్టుకుకుంటుంది. ముఖ్యమైన హీరోయిన్ గా కనపడ్డ  నివేదా పేతురాజ్ తన క్యారెక్టర్ కు న్యాయం చేకుర్చిందనే చెప్పాలి. మిగతా క్యారెక్టర్ ల విషయానికి వస్తే.. భూమిక, మేఘా లేఖ‌, సిమ్రాన్ చౌద‌రి, ముర‌ళీ శ‌ర్మ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, తదితదురులు.... వారి పాత్రలకు న్యాయం చేసుకుర్చారనే చెప్పాలి. 

చివరగా 'పాగల్' ఒక రొటీన్ కథతో కూడిన రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా పాగల్ అని చెప్పాలి. సినిమాలో విశ్వక్‌ సేన్‌,  నివేదా పేతురాజ్‌, మురళి శర్మ నటనతో పాటు, సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నా.. కథ, కథనం ఆకట్టుకొనిలేని కొన్ని లవ్‌ సీన్స్‌, సెకండాఫ్‌లో సాగదీత, రొటీన్‌ క్లైమాక్స్‌ సినిమా బలహీనతలుగా చెప్పుకోవచ్చు... 

గమనిక: ఈ రివ్యూ  సినిమా చూసిన ఒక వ్యక్తి కోణానికి సంబంధించిన అభిప్రాయం మాత్రమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News