Prabhas Birthday: No Hero Wished him in Social Media: అక్టోబర్ 23వ తేదీ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెలువలా కురిసింది. అదే రోజు బిల్లా సినిమా రీ రిలీజ్ కూడా చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలు థియేటర్లలోనే జరుపుకున్నారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది. సాధారణంగానే తెలుగు సినీ పరిశ్రమంలో ఏదైనా హీరో పుట్టినరోజు ఉంటే ఇతర హీరోలు ఆయనను విష్ చేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అది సర్వసాధారణమైన విషయమే కానీ ఈసారి ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో టాప్ హీరోలుగా చలామణి అవుతున్న వారు ఎవరూ ఆయనను విష్ చేస్తూ ఒక్క ట్వీట్ చేయకపోవడం గమనార్హం. తెలుగులో విక్టరీ వెంకటేష్, రామ్ పోతినేని వంటి హీరోలు అలాగే పాయల్ రాజ్ పుత్, కృతి సనన్ వంటి హీరోయిన్లు తప్ప ప్రభాస్ ను ఎవరూ ఎందుకు విష్ చేయలేదు? అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి గతంలోనే మన హీరోలు కొంతమంది వెళ్లి బాలీవుడ్ లో సినిమాలు చేసి వచ్చినా సరే పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ ని పరిచయం చేసిన బాహుబలి సినిమాతో ప్రభాస్ కి మంచి క్రేజ్ లభించింది.


నార్త్ లో కూడా ప్రభాస్ అంటే ఎవరో తెలుసు, అలాగే ప్రభాస్ సౌమ్యమైన స్వభావం చూసి వారు కూడా ఎక్కువ మంది అభిమానులుగా మారారు. ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ని చూసి మన హీరోలకి అసూయగా ఉందని ప్రభాస్ అభిమానులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ప్రభాస్ కి ట్విట్టర్ అకౌంట్ లేదు అలాగే సోషల్ మీడియాలో కూడా ఉండడు కాబట్టి సోషల్ మీడియా వేదికగా విష్ చేసి ఉండకపోవచ్చు వారు నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపి ఉండవచ్చు కదా ఈ విషయం మీద అనవసర రాద్ధాంతం చేయకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.


మొత్తానికి ప్రభాస్ పుట్టినరోజు విషెస్ వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడంతో హీరోలు ఎవరు విష్ చేయకపోవచ్చు అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ చేయండి.


Also Read: PawanKalyan with Meher Ramesh: పవన్ తో సినిమా చేసి తీరతానన్న మెహర్ రమేష్..టెన్షన్లో మెగా ఫాన్స్!


Also Read: Tollywood Audience: క్లాస్ సినిమాలా అబ్బే వద్దండీ అంటున్న ఆడియన్స్.. థియేటర్ కు రావాలంటే ఆమాత్రం ఉండాల్సిందే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook