Prabhas Fined: రెబల్ స్టార్ ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించినట్లు వచ్చిన వార్తలను ఆయన పీఆర్ టీమ్ ఖండించింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన బెంజి కారు ప్రభాస్‌ది కాదని స్పష్టం చేసింది. ఆ కారు ప్రభాస్ బంధువు నరసింహరాజుది అని పేర్కొంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్‌తో ప్రభాస్ పీఆర్ టీమ్ ట్రాఫిక్ సీఐ ముత్తును కలిశారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, శనివారం (ఏప్రిల్ 16) జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ఓ కారును ట్రాఫిక్ పోలీసులు ఆపగా... అది ప్రభాస్‌ కారుగా గుర్తించినట్లు ప్రచారం జరిగింది. కారుకు నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.1450 జరిమానా విధించినట్లు తెలిసింది. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో ప్రభాస్ పీఆర్ టీమ్ అలర్ట్ అయింది. వెంటనే ట్రాఫిక్ సీఐ ముత్తును కలిసి అది ప్రభాస్ కారు కాదని వివరణ ఇచ్చింది.


సినిమాల విషయానికొస్తే... ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్ డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ప్రభాస్ నుంచి మాస్ ఎంటర్టైనర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ అయిపోగా సలార్, ప్రాజెక్ట్ కె ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ 3 సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. 


Also Read: Prabhas Fined: ఆ కారు ప్రభాస్‌ది కాదు... క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ పీఆర్ టీమ్...


Also Read: Prashant Kishor: టార్గెట్ 2024... కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిశోర్...? పార్టీకి పునర్వైభవం కోసం పీకే రోడ్ మ్యాప్..! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook