Kalki Break Even: ఆ రెండు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ‘కల్కి’.. ఇకపై అన్ని లాభాలే..
Kalki Break Even: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి’ విడుదలైన అన్ని ఏరియాల్లో దుమ్ము దులుపుతుంది. నార్త్ అమెరికాలో అయితే.. రికార్డు బ్రేక్ వసూల్లతో దుమ్ము దులుపుతుంది. నిన్నటికి బాక్సాఫీస్ దగ్గర ఆరు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే రెండు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొంది.
Kalki Break Even: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తొలి రోజు అన్ని ఏరియాల్లో రికార్డు వసూళ్లతో పలు రికార్డులకు పాతర వేసింది ‘కల్కి 2898 AD’. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా అందరు కలిసి నటించిన ఈ విజువల్ వండర్ కు ప్రతి చోట ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కొత్త లోకాలను చూసి ప్రేక్షకులు తన్మయత్వానికి లోనవుతున్నారు. ముఖ్యంగా కాశీ, కాంప్లెక్స్, శంబలా మూడు కొత్త ప్రపంచాల సంఘర్షణకు మన పురాణాలతో పాటు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే కేరళలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రూ. 70 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఈ టార్గెట్ ను ఆరు రోజుల్లో రూ. 73 కోట్లకు పైగా షేర్ (120 కోట్ల గ్రాస్) తో ఈ సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 140 కోట్ల షేర్ .. దాదాపు రూ. 220 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో టాప్ లో ఉంది.
తెలుగులో రూ. 30 కోట్ల షేర్ అందుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా కల్కి దూకుడు చూస్తుంటే.. ఈ సినిమా ఈ వీకెండ్ వరకు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే బిజినెస్ వాల్యూ మీద దాదాపు 86 శాతం రికవరీ అయింది. మొత్తంగా ఈ సినిమా ముందు ముందు ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తుందో చూడాలి.
Also Read: KCR: కేసీఆర్ సంచలన ప్రకటన.. వాళ్లు పోతేపోనీ మిమ్మల్నే ఎమ్మెల్యేలుగా చేసుకుంటాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter