Prabhas - Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. త్వరలో ఈ సినిమా సెన్సార్ కు వెళ్లనుంది. ఈ సినిమా దాదాపు 3 గంటల పాటు ఉండనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఈ సినిమా కర్ణాటక బిజినెస్ క్లోజ్ అయినట్టు సమాచారం. అక్కడ ఈ సినిమా రూ. 25 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. మరవైపు తమిళంలో కూడా ఈ సినిమాకు రికార్డు బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఈ సినిమాలో కమల్ హాసన్ నటించడంతో అక్కడ ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా అక్కడ దాదాపు రూ. 20 కోట్ల వరకు క్లోజ్ అయినట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తెలుగులో ఈ సినిమా దాదాపు రూ. 160 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమచారం.మరోవైపు హిందీ , రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి దాదాపు రూ. 100 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం. మొత్తంగా రూ. 340 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.


'కల్కి 2898 AD' కోసం ప్రభాస్ 900 రోజులు డేట్స్ కేటాయించారు.కల్కి సినిమాలో  ప్రభాస్ సరసన దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. మరోవైపు బిగ్ బీ, కమల్ హాసన్ వంటి ఒకప్పటి నార్త్, సౌత్  స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.  లాస్ట్ ఇయర్ ఆదిపురుష్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నా ప్రభాస్.. సలార్ మూవీతో బ్యాక్ బౌన్స్ అయ్యారు. ఇపుడు సలార్ మూవీకి సీక్వెల్ గా సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం సినిమా చేస్తున్నాడు. ఆగష్టు వరకు ఈ సినిమా కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఇతర వర్క్స్ కారణంగా ఈ చిత్రం వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు  మేకర్స్. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలో కి రావడంతో ఈ సినిమా టికెట్ రేట్స్ పెంపుకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.


ప్రభాస్.. కల్కి మూవీ తర్వాత మారుతి డైరెక్షన్ తో 'ది రాజా సాబ్' చేస్తున్నాడు. ఇప్పటికే లుంగీతో ఉన్న ప్రభాస్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు మంచు విష్ణు ‘భక్త కన్నప్ప‘లో మహా దేవుడిగా అభిమానులకు దర్శనమీయనున్నాడు.
అటు సలార్ 2 శౌర్యంగా పర్వం, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, హను రాఘవపూడితో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీలు లైన్ లో ఉన్నాయి. వాటితో పాటు సిద్ధార్ధ్ ఆనంద్‌తో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీని త్వరలో స్టార్ట్ చేయబోతున్నాడు.  


Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook