Radhe Shyam First Review: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధేశ్యామ్ సినిమా కోసం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. పీరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్, ట్రైలర్‌, సాంగ్స్, మేకింగ్ వీడియోలు రాధేశ్యామ్ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. తాజాగా రాధేశ్యామ్ సెన్సార్‌ కార్యాక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు.. రాధేశ్యామ్‌ సినిమా ఎలా ఉందో వరుస ట్వీట్లు చేసి తన అభిప్రాయం చెప్పారు. భారత దేశంలో ప్రభాస్‌ క్లాస్‌, స్టైల్‌ను బీట్‌ చేసేవాళ్లే లేరని చెప్పారు. సినిమా క్లైమాక్స్ బాగుందన్నారు. 


'రాధేశ్యామ్‌ సినిమా సెన్సార్‌ ఇప్పుడే పూర్తయింది. సినిమా చూశాను. విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా బాగున్నాయి. ప్రభాస్‌, పూజా హెగ్డేల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్‌ ఎవరూ ఊహించని విధంగా తీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాధేశ్యామ్‌.. క్లాసిక్‌, స్టైలిష్‌, థ్రిల్లింగ్‌, మిస్టరీ అండ్‌ రొమాంటిక్‌ సినిమా అని చెప్పాలి. రాధేశ్యామ్‌ ఒక ఎపిక్‌. యూనిక్ సబ్జెక్టు ఇది. ప్రభాస్‌ అదరగొట్టేశాడు. అతని డ్రెస్సింగ్‌, యాక్టింగ్‌ అద్భుతం. భారత్‌లో ప్రభాస్‌ క్లాస్‌, స్టైల్‌ను బీట్‌ చేసేవాళ్లే లేరు' అని ఉమైర్ సంధు వరుస ట్వీట్లు చేశారు. 



ఉమైర్‌ సంధు చేసిన ట్వీట్‌లతో రాధేశ్యామ్‌ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రభాస్ మరోసారి రికార్డులు క్రియేట్‌ చేయడం ఖాయమనిపిస్తోంది. ఈ సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలవగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. రూ. 300కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమాలో భారీ తారాగణం ఉంది. భాగ్యశ్రీ, కృష్ణం రాజు, జగపతి బాబు, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్,  సత్యన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 


Also Read: Indian Students: ఉక్రెయిన్‌ నుంచి భారత్ చేరుకున్న 183 మంది.. నేడు మరో 2200 మంది!!


Also Read: INDW vs PAKW: పాకిస్తాన్‌పై ఘన విజయం.. వన్డే ప్రపంచకప్‌ 2022లో భారత్ బోణీ!!




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook