Prabhas Fan Suicide Letter: `సలార్` అప్‌డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ సూసైడ్ లెటర్...
Prabhas Die Hard Fan Suicide Letter: `సలార్` సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూసి చూసి విసిగిపోయిన ఓ అభిమాని ఏకంగా ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తూ సూసైడ్ లెటర్ రాశాడు.
Prabhas Die Hard Fan Suicide Letter: అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ.. మరీ వెర్రి అభిమానం పనికిరాదేమో. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పట్ల కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే అతిని చూస్తే ఇలాగే అనిపిస్తుంది. తాజాగా ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ ఒకరు ఏకంగా ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపు లేఖ రాశాడు. ఈ నెలలో గనుక 'సలార్' మూవీ గ్లింప్స్ విడుదల చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడం తప్పదని బెదిరించాడు. 'వి వాంట్ సలార్ అప్‌డేట్స్' అని అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సలార్ మూవీ అప్‌డేట్ ఇస్తామని చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నీల్... నెల రోజులు గడిచినా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదని సూసైడ్ లెటర్ పేరిట రాసిన లేఖలో సదరు ఫ్యాన్ పేర్కొన్నాడు. సలార్ రెగ్యులర్ అప్‌డేట్స్ గురించి అడిగి అడిగి విసిగిపోయామని... గతంలో సాహో, రాధేశ్యామ్ విషయంలోనూ ఇదే జరిగిందని అన్నాడు. సలార్ అప్‌డేట్స్ విషయంలో ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేయొద్దని... చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని... ధర్నాలకైనా సిద్ధమని పేర్కొన్నాడు. ఈ నెలలో సలార్ అప్‌డేట్ రాకపోతే తాను ఆత్మహత్య చేసుకోవడం ఖాయమని చెప్పుకొచ్చాడు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తుందని గతంలో ప్రకటించారు. కానీ షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో సినిమా మరో ఏడాదికి గానీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా లేదు. మరోవైపు, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో డై హార్డ్ ఫ్యాన్స్ అప్‌సెట్ అవుతున్నారు. అయితే ఎంత అప్‌సెట్ అయినా... ఇలా సూసైడ్ లెటర్స్ రాసి బెదిరింపులకు దిగడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి అభిమానులతో సదరు హీరోలకు కూడా ఇబ్బందేనని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Cyclone Asani: కాకినాడ, విశాఖ పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్...
Also Read: Narayana Bail: మాజీ మంత్రి నారాయణకు ఊరట... పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook