Controversial Dialogue on Sita: భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ మూవీ విడుదలైన తొలి రోజే లీగల్ ట్రబుల్స్‌లో పడింది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా రామాయణంలో ఉన్న వాస్తవికతకు చాలా దూరంగా ఉందని.. రాముడు, సీత, హనుమంతుడితో పాటు రావణుడి పాత్రలను చూపించడంలోనూ ఫ్యాషన్ పరంగా కొత్త పుంతలు తొక్కడంతో అది యావత్ హిందూ సమాజాన్నే కించపరిచేదిగా ఉంది అని హిందూ సేన అనే హిందూ సంస్థ జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త ఢిల్లీ హై కోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాల్సిందిగా.. లేదంటే సవరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా పిటిషనర్ విష్ణు గుప్త ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ఆదిపురుష్ మూవీపై నేపాల్ లో మరో వివాదం కారణంగా అక్కడ ఈ సినిమా ప్రదర్శించాల్సిన థియేటర్ల వద్ద షోలను నిలిపివేశారు. ఆదిపురుష్ మూవీలోని ఒక సాధారణ డైలాగ్ ఆ సినిమాపై నేపాల్ ఆగ్రహావేశాలు పెల్లుబుకడానికి కారణమైంది. 


ఇంతకీ ఏం జరిగిందంటే...
రాజధాని ఖాట్మాండు నగర మేయర్ బెలెన్ షా మీడియాతో మాట్లాడుతూ.. ఆదిపురుష్ మూవీలో సీతా దేవిపై ఒక అభ్యంతరకరమైన డైలాగ్ ఉందని అన్నారు. అదేంటంటే.. సీతా దేవిని భారత దేశం బిడ్డగా చిత్రీకరిస్తూ డైలాగ్ పెట్టారని.. కానీ సీతమ్మ వారిని నేపాల్ గడ్డపై బిడ్డగా తామంతా ఆరాధిస్తామని.. అందుకే ఆ డైలాగ్ తమ మనోభావాలని కించపరిచేదిగా ఉంది అని అన్నారు. అంతేకాకుండా నేపాల్‌లో ఆదిపురుష్ మూవీ స్క్రీనింగ్ నిలిపేయాల్సిందిగా ఖాట్మాండు నగర మేయర్ బెలెన్ షా పట్టుపట్టారు. బెలెన్ షా మేయర్ కావడంతో ఆయన ఆదేశాలతో ఖాట్మాండులో ఆదిపురుష్ మూవీ నిలిచిపోయింది. 


ఇది కూడా చదవండి : Adipurush first day collections: తొలి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆదిపురుష్... ఎంత వసూలు చేసిందంటే?


భౌగోళికంగా చిన్న దేశమైన నేపాల్ లో ఎక్కువ కలెక్షన్స్ రావాలంటే అక్కడున్న ఏకైక బాక్సాఫీస్ మార్కెట్ ఖాట్మాండు నుంచే రావాల్సి ఉండగా.. మేయర్ పిలుపుతో సినిమా షోలు ఆగిపోవడం వల్ల అక్కడి నుంచి వచ్చే కలెక్షన్స్ పై ఇది నెగటివ్ ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. కాకపోతే.. ఇండియన్ సినిమాలకు ఓవర్సీస్‌లో అతి పెద్ద మార్కెట్స్ అమెరికా, బ్రిటన్ కావడంతో నేపాల్‌లో ఆదిపురుష్ మూవీ షో ఆగిపోయినా.. అదేమంతగా ఓవర్సీస్‌పై ప్రభావం చూపించకపోవచ్చు అని కూడా అనుకోవచ్చు.


ఇది కూడా చదవండి : Adipurush Movie Controversy: వివాదంలో ఆదిపురుష్ మూవీ.. హై కోర్టులో పిల్ దాఖలు


ఇది కూడా చదవండి : Adipurush Full HD Print Leaked: ఆదిపురుష్ ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్.. ఇంటర్నెట్లో ఫుల్ మూవీ


ఇది కూడా చదవండి : Adipurush Preview: ఆదిపురుష్ మూవీని థియేటర్లలోనే ఎందుకు చూడాలంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK