Adipurush Movie Preview: ఆదిపురుష్ మూవీని థియేటర్లలోనే ఎందుకు చూడాలంటే..?

Adipurush Preview: ప్రభాస్, కృతిసనన్ శ్రీరాముడు, సీత పాత్రల్లో, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న.. అంటే రేపే భారీ అంచనాల మధ్య విడుదల అవనుంది. ఆదిపురుష్ మూవీని థియేటర్లలో మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలి అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Written by - Pavan | Last Updated : Jun 17, 2023, 07:35 PM IST
Adipurush Movie Preview: ఆదిపురుష్ మూవీని థియేటర్లలోనే ఎందుకు చూడాలంటే..?

Adipurush Preview: ప్రభాస్, కృతిసనన్ శ్రీరాముడు, సీత పాత్రల్లో, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న.. అంటే రేపే భారీ అంచనాల మధ్య విడుదల అవనుంది. హిందీ, తెలుగు, తమిళ, మళయాళం వంటి అన్ని ప్రధాన భాషల్లో ఆదిపురుష్ డబ్బింగ్ వెర్షన్‌ విడుదల కానుంది. ఆదిపురుష్ మూవీని థియేటర్లలో మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలి అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

ప్రభాస్ అనేక డబ్బింగ్ చిత్రాలతో పాటు బాహుబలి, సాహో లాంటి చిత్రాలతోనూ హిందీ ఆడియెన్స్ కి ఎప్పుడో సుపరిచితం అయ్యాడు. కానీ నేరుగా హిందీ దర్శకుడు డైరెక్ట్ చేసిన, హిందీ సినిమాలో నటించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే, ప్రభాస్ లిప్ సింక్ ఎలా ఉండనుంది, హిందీ ఆడియెన్స్ ప్రభాస్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం.

ప్రభాస్ హిందీ ఆడియెన్స్‌కి ఎలాగో.. సైఫ్ అలీ ఖాన్ కూడా అలాగే తెలుగుతో పాటు దక్షిణాదిలోని ఇతర భాషల ఆడియెన్స్‌కి అదే విధంగా పరిగణించాల్సి ఉంటుంది. శ్రీరాముడిగా ప్రభాస్ పాత్రకు ఎంత వెయిటేజ్ ఉంటుందో.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ పాత్రకు కూడా అంతే వెయిటేజీ ఉంటుంది. లంకేశ్వరుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ ఎంత బాగా పండించాడు అనేది బిగ్ స్క్రీన్‌పై చూస్తేనే తెలుస్తుంది. 

ఇది కూడా చదవండి: Adipurush Movie: ఆదిపురుష్‌ మూవీని ఊరిస్తున్న ఓపెనింగ్ డే రికార్డులు

రామాయణం అంతా ఒక కథలానే ఉన్నప్పటికీ.. అందులోనే అరణ్యకాండ, యుద్ధ కాండ అంటూ ఇంకెన్నో కథలు ఇమిడి ఉంటాయి. ఎక్కువ సన్నివేశాలు అరణ్య కాండ, యుద్ధ కాండపైనే ఉంటాయి. ఈ క్రమంలో సినిమా చూసే ఆడియెన్స్ కి ఇందులో ఏయే అంశాలు మిస్ అయ్యాయో చెప్పేందుకు ఒక మంచి అవకాశం కానుంది.

రణ్‌బీర్ కపూర్, గోపీ చంద్, అల్లు అర్జున్, అనుష్క లాంటి స్టార్ సెలబ్రిటీలు ఒక్కొక్కరు 10 వేల టికెట్స్ కొనుగోలు చేసి అవసరమైన వారికి పంచిపట్టినట్టు తెలుస్తోంది. 

తెలుగులో U సర్టిఫికెట్ ఉండే సినిమాలు అతి అరుదు. యాక్షన్ సీక్వెల్స్ కారణంగానే సినిమాలకు యూ సర్టిఫికెట్ లభించే అవకాశాలు చాలా అరుదు. కానీ ఆదిపురుష్ మూవీలో యాక్షన్ సీక్వెల్స్ ఉన్నప్పటికీ యూ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అనేది సినిమాను చూశాకే అర్థం అవుతుంది.

ఇది కూడా చదవండి: Adipurush Movie: అంతా ఆదిపురుష్ మేనియా, మొదటి రోజు వంద కోట్లు దాటేస్తుందా

ఆదిపురుష్ ఫస్ట్ ట్రైలర్ విడుదలైనప్పుడు అందులోని లో క్వాలిటీ గ్రాఫిక్స్ చూసిన జనం.. ఇదొక కార్టూన్ సినిమాలా ఉందే అని ట్రోల్ చేశారు. దాంతో అప్రమత్తమైన ఆదిపురుష్ నిర్మాతలు... దాదాపు రూ. 100 కోట్లు వెచ్చించి గ్రాఫిక్స్ అప్‌డేట్ చేశారు. అప్‌డేట్ చేసిన ఆ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూడ్డానికైనా ఆడియెన్స్ థియేటర్‌కి వెళ్లాల్సిందే. 

అరణ్య కాండ, యుద్ధ కాండ వంటి సన్నివేశాలతో పాటు వాలీ, సుగ్రీవుడి మధ్య వచ్చే ఫైటింగ్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి అని మూవీ యూనిట్ చెబుతోంది. అలాంటి యాక్షన్ సన్నివేశాలు ఎంజాయ్ చేయాలంటే ఆదిపురుష్ సినిమాను బిగ్ స్క్రీన్‌పైనే ఎంజాయ్ చేయాలి.

ఇది కూడా చదవండి: Adipurush Movie: ఆదిపురుష్ యూనిట్‌కు గుడ్‌న్యూస్, టికెట్ ధర పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News