Prabhas Surgery : ప్రభాస్ ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలిసిందే. బాహుబలి సమయం నుంచి ప్రభాస్ ఏదో ఒక గాయంతో బాధపడటం, సర్జరీలు అంటూ రెస్ట్ తీసుకోవడం గురించి అందరికీ తెలిసిందే.  ఇప్పటికీ ప్రభాస్ తన సర్జరీలో బాధపడుతూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. అందుకే విదేశాల్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. సలార్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు. మారుతి సినిమాను కూడా హోల్డ్‌లో పెట్టేస్తున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు తన పెదనాన్న మరణంతో బయటకు రావాల్సి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదిపురుష్‌ టీజర్ లాంచ్ ఈవెంట్ కోసం అయోధ్యకు రావాల్సి వచ్చింది. అయితే ఈ ఈవెంట్లో ప్రభాస్ నడిచేందుకు కూడా చాలా కష్టపడ్డట్టు కనిపిస్తోంది. ప్రభాస్ తన టీంతో కలిసి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అటు పక్క డైరెక్టర్ ఓం రౌత్, ఇటు పక్కన కృతి సనన్ నడుస్తుండగా.. మధ్యలో ప్రభాస్ వారి సాయంతో నడిచాడు. ఇక మెట్లు దిగే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం కృతి సనన్‌ చేతిని తీసుకున్నాడు. ఓం రౌత్ భుజం మీద చేయి వేశాడు ప్రభాస్.


 



అలా ప్రభాస్ ఈ ఈవెంట్లో చాలా చోట్ల నిలబడటానికి కూడా ఇబ్బంది పడ్డాడు. కనీసం నిలబడలేకపోడం, మెట్లు కూడా దిగలేకపోవడం చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. మళ్లీ ఏదైనా ప్రాబ్లం అయిందా? ఇంకా సర్జరీ నాటి దెబ్బ తగ్గలేదా? ఇలా అయితే సలార్ వంటి యాక్షన్ సినిమాను ఎలా పూర్తి చేస్తాడు? అంటూ ఇలా అభిమానులు కంగారు పడుతున్నారు. మరి ప్రభాస్ ఆరోగ్యం మీద ఇప్పుడు చర్చలు జరుగుతుండగా.. ఆదిపురుష్ టీజర్ ట్రోల్స్ మరింతగా ఎక్కువయ్యాయి.


ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్లో కృతి సనన్ అయితే.. ప్రభాస్‌కు చేదోడు వాదోడుగా ఉంది. ప్రభాస్‌ను చూపుల్తోనే తినేసేలా చూస్తూ ఉండిపోయింది. ప్రభాస్‌కు చెమటలు పడుతుంటే.. తుడుచుకునేందుకు కొంగును అందించబోయింది. కానీ ప్రభాస్ మాత్రం తన చేత్తోనే తుడుచుకున్నాడు. జ్యోతిని వెలిగించే సమయంలోనూ ప్రభాస్‌కు సాయంగా నిల్చుంది కృతి సనన్.  దీంతో వీరి ప్రేమ కథలు మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మీడియా చెప్పినట్టుగా.. ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? అనే అనుమానం కలుగుతోందంటూ నెటిజన్లు అనుకుంటున్నారు.
 


Also Read : లేచి వెళ్లిపోయిన ఉపాసన.. రామ్ చరణ్‌ని చూసి నవ్విన సాయి ధరమ్ తేజ్


Also Read : kriti sanon-prabhas : ప్రభాస్‌కు చెమటలు.. తుడుచుకునేందుకు కొంగును ఇచ్చిన కృతి సనన్.. వీడియో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook