Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!
The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం కల్కి2898AD సినిమా కోసం ది రాజా సాబ్ చిత్ర బృందం కావాలని సినిమా కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలేదని తెలుస్తోంది.
Kalki 2898AD update: వరుస డిజాస్టర్లతో సతమతమైనప్పటికీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ ఏమాత్రం దెబ్బతినలేదు. వరుసగా మూడు డిజాస్టర్లు వచ్చినప్పటికీ ప్రభాస్ సలార్ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం సలార్ రెండవ భాగం తో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. చేతిలో పలు సినిమాలు పెట్టుకున్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమాకి కూడా సైన్ చేశారు. నిజానికి ప్రభాస్ చేతిలో ఉన్న అన్ని సినిమాల కంటే ఈ సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి.
గత కొంతకాలంగా యాక్షన్ సినిమాలు వైలెన్స్ సినిమాల్లో మాస్ పాత్రలలో ప్రభాస్ ని చూస్తూ విసిగిపోయిన అభిమానులకు ఈ సినిమాతో ఒక ఊరట లభిస్తుంది అని అందరూ అనుకున్నారు. హారర్ కామెడీ జానెర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. డైరెక్టర్ మారుతీ ట్రాక్ రికార్డ్ యావరేజ్ గా ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
కానీ చిత్ర బృందం మాత్రం ఈ సినిమా గురించి అప్డేట్లు ఇవ్వడం లేదు. తాజాగా మిరాయ్ టైటిల్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపున నిర్మాత విశ్వప్రసాద్ ది రాజా సాబ్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. కల్కి 2898 సినిమా రిలీజ్ అయిన తర్వాతే రాజా సాబ్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు మొదలవుతాయని తెల్చి చెప్పారు.
ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్ ఇండియా సినిమా అయిన కల్కి సినిమా విడుదల కి సిద్ధంగా ఉన్న సమయంలో ఇంకొక సినిమా గురించి ప్రచారం చేయడం బావుండదు అని, అందుకే కల్కి సినిమా కోసం ది రాజా సాబ్ బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ సగానికి పైనే పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తాత పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు అని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లేదా వేసవిలో విడుదల కి సిద్ధం అవుతుంది.
Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?
Also Read: Revanth Is Lilliput: 'రేవంత్ రెడ్డి ఒక లిల్లీపుట్': కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter