Radhe Shyam film special show in World Second Largest IMAX Screen at Melbourne: కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ 'రెబల్ స్టార్' ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా 'రాధే శ్యామ్' (Radhe Shyam). బాహుబలితో  ప్రపంచ స్టార్ అయిన ప్రభాస్.. 'రాధే శ్యామ్'పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా.. 70ల కాలం నాటి ప్రేమ కథతో రూపొందించారు. ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడిగా, పూజా హెగ్డే (Pooja Hegde) ప్రేరణ పాత్రలో కనిపించనున్నారు. 2022 జనవరి 14 విడుదల కానున్న ఈ సినిమా కోసం ఫాన్స్ వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్‌ నుంచి మేకర్స్‌ వరసగా అప్‌ డేట్స్‌ ఇస్తూ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతున్నారు. పిరియాడికల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌, పాటలకు విశేష స్పందన వచ్చింది. రాధే శ్యామ్‌లో ప్రభాస్‌ను పరిచయం చేస్తూ ఇటీవల రిలీజ్‌ చేసిన 'సంచారి' పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అయితే రాధే శ్యామ్‌ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసేందుకు చిత్ర బృందం మరో అప్‌ డేట్ ఇచ్చింది. 


Also Read: Kajal Aggarwal Pregnant: వైరల్ ఫొటోస్.. బేబీ బంప్‌తో కాజల్‌ అగర్వాల్‌!!


ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్క్రీన్‌లో రాధే శ్యామ్ సినిమా స్పెషల్ షో (Radhe Shyam Special Show) ప్రదర్శించబడుతుంది. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని IMAX స్క్రీన్‌పై ఈ స్పెషల్ షో 2022 జనవరి 14న విడుదల కానుంది. ఆ రోజు ఉదయం  7:30 గంటలకు స్పెషల్ షో మొదలవుతుంది. దాంతో ఆస్ట్రేలియాలో ఉన్న ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2021 సెప్టెంబర్ వరకు మెల్‌బోర్న్‌లోని IMAX థియేటర్ ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ ఇటీవల జర్మనీ స్టుట్‌గార్ట్‌లోని లియోన్‌బర్గ్‌లోని IMAX అతిపెద్ద స్క్రీన్‌గా మారింది. లియోన్‌బర్గ్‌లోని IMAX 144× 75 అడుగుల పరిమాణంలో ఉండగా.. మెల్‌బోర్న్‌లోని IMAX 105 × 75 అడుగుల పరిమాణంలో ఉంది. 


Also Read: Ys Jagan Birthday: సముద్రగర్భం నుంచి విషెస్, జగన్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు


ఆస్ట్రేలియా (Australia) మెల్‌బోర్న్‌ (Melbourne)లోని IMAX స్క్రీన్‌పై రాధే శ్యామ్ స్పెషల్ షో (Radhe Shyam Special Show) ప్రదర్శించబడుతుందని తెలుగు సినీ పరిశ్రమలోని ఒక వ్యక్తి తెలిపారు. ఈ షో కోసం టిక్కెట్లు ఇప్పటికే ఆన్ లైన్‌లో అందుబాటులో ఉన్నాయట. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని సమాచారం. IMAX మెల్‌బోర్న్ వెబ్‌సైట్ కూడా సినిమా నిడివి 155 నిముషాలు ( 2 గంటల 35 నిమిషాలు) అని పేర్కొంది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 23న జరగనున్న విషయం తెలిసిందే. అభిమానులే గెస్టులుగా హాజరుకానున్నారు. ఐదు భాషలకు చెందిన ట్రైలర్స్‌ను ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి