Ys Jagan Birthday: సముద్రగర్భం నుంచి విషెస్, జగన్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు

Ys Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం రేపు. ఈ సందర్బంగా శాప్ ఛైర్మన్ సిద్ధార్ధరెడ్డి వినూత్న తరహాలో..సాహసోపేతంగా జగన్‌కు శుభాకాంక్షలు అందించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 20, 2021, 03:46 PM IST
Ys Jagan Birthday: సముద్రగర్భం నుంచి విషెస్, జగన్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు

Ys Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం రేపు. ఈ సందర్బంగా శాప్ ఛైర్మన్ సిద్ధార్ధరెడ్డి వినూత్న తరహాలో..సాహసోపేతంగా జగన్‌కు శుభాకాంక్షలు అందించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు(Ys Jagan Birthday) రేపు. డిసెంబర్ 21న ప్రియతమ నేత పుట్టినరోజు పురస్కరించుకుని రాష్ట్రమంతా వివిధ రకాల సేవా కార్యక్రమాలు, వివిధ రూపాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. జగన్ అంటే ప్రాణమిచ్చే వ్యక్తులు మరి కాస్త వినూత్నంగా ఆలోచించి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్దరెడ్డి అదే పని చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా క్రీడల్ని ప్రోత్సహించే కార్యక్రమంగా భాగంగా విశాఖలో ఉన్న ఆయన..వినూత్నంగా ముఖ్యమంత్రి జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు(Birthday Wishes)అందించారు. మరో వ్యక్తితో కేసి విశాఖ సముద్రంలో 30 అడుగుల లోతువరకూ స్కూబా డైవ్ చేశారు. సముద్రగర్భం నుంచి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే సీఎం సార్ అంటూ ఓ ప్లేట్‌పై స్వయంగా రాసి..శుభాకాంక్షలు అందించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అంతకుముందు విశాఖలోని రుషికొండలో ఏర్పాటైన యాటింగ్ సెంటర్‌ను సందర్శించారు. రాష్ట్రంలోని నదులు, సముద్రంలోని 110 ప్రాంతాలు జలక్రీడలకు అనుకూలంగా ఉన్నాయని సిద్ధారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన సీఎం కప్ స్టేట్ జూనియర్స్, యూత్‌మెన్, విమెన్ బాక్సింగ్ టోర్నీలు సిద్ధార్ధ్ రెడ్డి ప్రారంభించారు. 

Also read; Fever Survey: ఏపీలో ఇవాళ్టి నుంచి ఇంటింటికీ ఫీవర్ సర్వే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News