Prabhas's Salaar Leaked Scene Creates a Strome in Internet: ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సింహభాగం పూర్తయింది అని తెలుస్తోంది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన 12 సెట్లలో ఇప్పుడు షూటింగ్ జరపాల్సి ఉంది. కానీ ప్రభాస్ కోసం సినిమా యూనిట్ ఎదురు చూస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ తన అనుచరులతో నిలబడి ఉన్న సమయంలో చేస్తున్న ఒక షూటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ప్రభాస్, సలార్ సినిమా నుంచి అనేక ఫోటోలు కొన్ని వీడియోలు కూడా గతంలోనే లీక్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ లీకేజీ వ్యవహారం సలార్ మేకర్స్ కు తలనొప్పిగా మారింది.


ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. సినిమాని హోంబాలే ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో 12 సెట్లు నిర్మించారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తూ రామోజీ ఫిలిం సిటీ లోనే బస చేస్తున్నారని, వీలైనంత త్వరలో ప్రభాస్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.


ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో కొన్నాళ్ల పాటు ప్రభాస్ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటారని అందరూ భావిస్తే ఈ సినిమా షూటింగ్ కోసం సెట్స్ నిర్మించడంతో అద్దె భారం నిర్మాతల మీద పడుతుందని తెలుసుకున్న ప్రభాస్ తాను షూటింగ్ కి హాజరవుతానని వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం మీద మాత్రం ఇప్పటివరకు అధికారిక క్లారిటీ అయితే లేదు.


ఇక ఈ సినిమాలు కాకుండా ప్రభాస్ ఆది పురుష్, ప్రాజెక్టు కే, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ అనే సినిమాలలో కూడా హీరోగా నటిస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో కూడా ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు వెలువడలేదు. మారుతి కాంబినేషన్ లో రూపొందే సినిమాలో ఒక బాలీవుడ్ సీనియర్ హీరో నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇప్పటివరకు అయితే లేదు.  


Also Read: God Father in Malayalam: మలయాళ రీమేక్ సినిమాను మళ్లీ డబ్బింగ్ చేస్తున్నారా? బుర్ర ఉందా?


Also Read: Raghavendra Rao on Name Change: హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది.. పేరు మార్పుపై రాఘవేంద్రరావు స్పందన!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook