Prakash Raj resigns from Maa Association: ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశాడు. మా అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి మంచు విష్ణు చేతిలో ఓటమిపాలైన ప్రకాశ్ రాజ్.. ఇవాళ మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రాంతీయ విభేధాలతో పనిచేసే అసోసియేషన్‌లో తాను కొనసాగలేనని.. అందుకే అసోసియేషన్ నుంచి తప్పుకుంటున్నాననని ఆవేదన వ్యక్తంచేసిన ప్రకాశ్ రాజ్.. ఒక నటుడిగా తెలుగు సినిమాకు సేవ చేస్తూనే ఉంటానని ప్రకటించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కి మద్దతు పలికిన మెగా బ్రదర్ నాగబాబు (Nagababu's resignation to MAA) సైతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సభ్యత్వ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాశ్ రాజ్ కూడా మా అసోసియేషన్‌కి రాజీనామా చేయడం చూస్తోంటే.. మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఓటమి వారిని ఎంత ఆవేదనకు గురిచేసిందో ఇట్టే అర్థం అవుతోందని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 


ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికైన మా అసోసియేషన్ ఎన్నికలు ఫిలింనగర్ వాతావరణాన్ని ఈసారి ఎప్పటికంటే మరింత ఎక్కువ వేడెక్కించాయి. సినీరంగంలో ఉన్న ప్రముఖులను చెరోవైపు విడిపోయేలా చేశాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.


Also read : MAA Elections 2021: 'అంకుల్ తొందరపడొద్దు'...ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాపై విష్ణు స్పందన


అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ స్థానికుడు కాదనే అభిప్రాయాన్ని మంచు విష్ణు ప్యానెల్ (Manchu Vishnu pannel) తెరపైకి తీసుకురాగా.. ''సినీ రంగంలో స్థానికులు, స్థానికేతరులు అని ఉండరని, తెలుగు సినిమాలకు సైన్ చేసి, తెలుగు వారితో అవార్డులు, ప్రశంసలు అందుకున్నప్పుడు రాని ప్రాంతీయ విభేధాలు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎందుకు వస్తున్నాయి'' అంటూ ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యాడు. 


తాజాగా తన రాజీనామా సందర్భంగా కూడా ప్రకాశ్ రాజ్ (MAA election updates) అదే అంశాన్ని కారణంగా చూపించాడు. లోకల్ పాలిటిక్స్ అంటూ ప్రాంతీయ విభేధాలు ఉన్న చోట తాను పనిచేయలేనంటూ అసోసియేషన్ లోంచి బయటికొస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించాడు.


Also read : MAA Elections 2021: మెగాబ్రదర్ సంచలన నిర్ణయం..'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా


Also read : MAA Elections results: ప్రకాష్ రాజ్‌కు షాక్.. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు..


Also read : MAA Elections 2021: హేమ కొరకడంతో టీటీ ఇంజెక్షన్‌ వేయించుకున్న శివ బాలాజీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook