Pranitha Subhash Pregnancy: ప్రముఖ కన్నడ నటి ప్రణితా సుభాష్ తల్లి కాబోతోంది. తాను గర్భం దాల్చినట్లు ప్రణితా సుభాష్ సోషల్ మీడియాలో వెల్లడించింది. తన భర్త నితిన్ రాజు 34వ పుట్టినరోజుకు ముందు తమకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి ఇదని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ లో తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ కు సంబంధించిన ఫలితాలను చూపిస్తూ.. ప్రణిత దంపతుల ఫొటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి..


బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును గతేడాది ప్రేమించి పెళ్లాడింది నటి ప్రణితా సుభాష్. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇదే విషయాన్ని తమ ఇరు కుటుంబాలకు చెప్పి పెళ్లికి ఒప్పించుకున్నారు. ఆ తర్వాత గతేడాది మే నెలలో ప్రణితా సుభాష్, నితిన్ రాజుల వివాహం జరిగింది. కరోనా ఆంక్షల నడుమ అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వేడుకను నిర్వహించారు. "మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి. కరోనా ఆంక్షల కారణంగా పెళ్లి తేదీ, ముహూర్తంపై ఒకరోజు ముందే తెలిసింది" అంటూ అప్పట్లో ప్రణితా సుభాష్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 



ప్రణితా సుభాష్.. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన 'బావ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 'రభస', 'డైనమైట్', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'ఎన్టీఆర్ - కథానాయకుడు' చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రణితా సుభాష్ ను తెలుగు వారు ముద్దుగా బాపు బొమ్మ అని పిలుచుకుంటారు.  


Also Read: Ranbir Alia Wedding Date: రణ్ బీర్, అలియా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వేడుకకు తరలిరానున్న బాలీవుడ్ ప్రముఖులు!


Also Read: Krithi Shetty Photos: ఎర్ర గులాబీతో ప్రపోజ్ చేస్తున్న హీరోయిన్ కృతిశెట్టి- ఫొటోలు వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook