Prasanna Vadanam: `పుష్ప` సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర చేయాల్సింది సుహాసే.. ప్రసన్న వదనం ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Prasanna Vadanam: మన తొట్ట తొలి దేవుడు వినాయకుడి శ్లోకంలో ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేప శాంతయే.. పేరులోని ప్రసన్న వదనం పేరుతో వస్తోన్న చిత్రం. ఈ సినిమాలో సుహాస్ కథానాయకుడిగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Prasanna Vadanam: ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ప్రసన్న వదనం'. యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్ సంయుక్తంగా తెరకెక్కించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధిగా హాజరై ఈ సినిమా యూనిట్ పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ వేడుకలో దర్శకులు బుచ్చిబాబు, కార్తిక్ దండు, శ్రీనివాస్ అవసరాల, రైటర్ ప్రసన్న ఈ వేడుకలో పాల్గొన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..
సుహాస్.. అంటే నాకు, అల్లు అర్జున్‌కి చాలా ఇష్టం. ‘పుష్ప’లోని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవగా ముందు సుహాస్‌నే అనుకున్నాము. కానీ, అప్పటికే సుహాస్ హీరోగా చేయడంతో ఆ పాత్ర కోసం వేరే నటుడిని తీసుకున్నట్టు చెప్పారు. నాని నటన నాకు బాగా ఇష్టం. సుహాస్.. ఫ్యూచర్ నానిలా అనిపిస్తున్నాడు. నాని సహజ నటుడు కాబట్టి సుహాస్‌ని మట్టి నటుడు అనాలేమో అన్నారు. ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆయా పాత్రలకు న్యాయం చేసారన్నారు.
నేను ‘జగడం’ సినిమా రూపొందిస్తున్న సమయంలో అర్జున్ కలిశాడు. ‘మీ ‘ఆర్య’ చిత్రం నాకు బాగా నచ్చింది సర్. మీ వద్ద పని చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. టీమ్‌లో జాయిన్ చేసుకున్నాను. అర్జున్ చాలా అమాయకుడు. కానీ, బోలెడు లాజిక్ ఉన్నవాడు. అర్జున్, మరో అసిస్టెంట్ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో ‘100% లవ్’ స్టోరీ రాశా. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకి వీరిద్దరు పనిచేశారు. వీళ్లతోపాటు ఒక్కో చిత్రానికి ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉండేవారు. అర్జున్ కి ఏదైనా సమస్య చెబితే పరిష్కారం సెకన్స్ లో చెబుతాడు. నిజానికి తను హాలీవుడ్ లో వుండివుంటే మరో స్థాయి సినిమా తీసేవాడని తన అసిస్టెంట్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
తను చాలా నిజాయితీ పరుడు. ఈ సినిమాని చాలా నిజాయితీగా తీశాడు. తన ప్రేమ, నిజాయితీ చాలా ఇష్టం. ఈ సినిమా చూశాను. చాలా బావుంది. ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను. అంత చక్కగా తీశాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి.. నా అర్జున్‌ని సపోర్ట్ చేయండి. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందన్నారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ..
'ప్రసన్న వదనం' మే 3న రిలీజ్ అవుతుంది. కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్, అంబాజీ పేట.. ఈ సినిమాలన్నీ ప్రేక్షకులని అలరించాయి. ప్రసన్న వదనం కూడా ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుందన్నారు. మా సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన సుకుమార్ గారికి ప్రత్యేక ధన్యావాదలు తెలిపారు.
చిత్ర దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ..
సినిమాని అనుకున్నదాని కంటే చాలా బాగా చేశాము. నిర్మాతలు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. సుహాస్ దర్శకుల నటుడు. ఈజీగా పాత్రలోకి వెళ్ళిపోతారు. దర్శకుడి మనసులో ఏముందో తనకి తెలిసిపోతుంది.
నిర్మాత మణికంఠ మాట్లాడుతూ..
సినిమా చాలా అద్భుతంగా రావడం సంతోషంగా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ కావడం పక్కా అని నమ్మకంతో చెప్పారు. సినిమా వందశాతం బ్లాక్ బస్టర్. కలర్ ఫోటో తో నా జర్నీ మొదలైయింది. సుహాస్ కెరీర్ లో నా పేరు ఖచ్చితంగా ఓ పేజీ లో వుంటుంది. మా స్నేహం అలానే వుండాలని కోరుకుంటున్నాను.
నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..
సుహాస్‌తో ప్రయాణం చాలా బావుంది. రాశి, పాయల్ చక్కగా నటించారు. విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.టీం అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మే3న సినిమా విదుదలౌతుంది. తప్పకుండా చూడండి' అన్నారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి