Salaar Movie Length: కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో చేస్తున్న మూవీ 'సలార్'. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం 'సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక సాంగ్, ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో ట్రైలర్ ని యాక్షన్ కట్ తో రిలీజ్ చేశారు. అయితే ఇది మినహా ఇంకా ఎటువంటి ప్రమోషన్స్ ఈ సినిమాకి ప్లాన్ చేయలేదు ఈ చిత్ర నిర్మాతలు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలోనే ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన కథ చిత్రం కేజీఎఫ్‌కి చేసిన తప్పునే సలార్‌కి కూడా చేశానంటూ డైరెక్టర్ చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ “సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ ని చూసి, దానిలో ఏమన్నా మార్పులు చెయ్యొచ్చా అని చూసుకోలేని పరిస్థితి నాది. కేజీఎఫ్‌కి అలానే అయ్యింది, ఇప్పుడు మళ్లీ ప్రభాస్ సలార్ కి అలానే జరిగింది. అయినాసరి ఆ ఫైనల్ అవుట్ ఫుట్ పై నేను ఆనందం గానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. 


సాధారణంగా ఫైనల్ అవుట్ ఫుట్ చూసినప్పుడే సినిమాలో ఏమన్నా తప్పులు ఉన్నాయా అనేది దర్శకుడికి అర్థమవుతుంది. కానీ ప్రశాంత్ సలార్ విషయంలో అది చేయలేదు అనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏమిటి అంటే ఈ సినిమా లెంట్ కూడా ఎక్కువే. ఈ చిత్రం దాదాపు రెండు గంటల 52 నిమిషాల నిడివితో రానుంది. మరి చివరిగా ప్రశాంత్ ఈ సినిమాని ఒకసారి చూసి ఉంటే .. అనవసరపు సన్నివేశాలు తొలగించే అవకాశం ఉండొచ్చని.. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు ఏమన్నా అవసరంలేని సన్నివేశాలు ఉంటాయి ఏమో అని కొంతమంది ఆలోచిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ప్రశాంత్ కే జి ఎఫ్ సినిమా కూడా చూడలేదని.. కాబట్టి కేజీఎఫ్ లాగానే సలార్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంతే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.


Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..


Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి