Anantha Movie Review: అనంత మూవీ రివ్యూ.. సరికొత్త స్టోరీ లైన్
Anantha Movie Review In Telugu: సరికొత్త లైన్‌తో అనంత మూవీ తెరకెక్కింది. ఈ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మనిషి ఆయుష్షు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిట్ కొట్టిందా..? ప్రేక్షకులను మెప్పించిందా..?
సినిమా: అనంత
నటీనటులు: ప్రశాంత్ కార్తీ, రిత్తిక చక్రవర్తి, అనీష్ కురువెళ్ళ, గెడ్డం శ్రీనివాస్, లయ సింప్సన్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రినేత్ర క్రియేషన్స్
ప్రొడ్యూసర్: ప్రశాంత్ కార్తీ
డైరెక్టర్: మధు బాబు తోకల
మ్యూజిక్ డైరెక్టర్: ఘంటశాల విశ్వనాథ్
రిలీజ్ డేట్: జూన్ 9, 2023
Anantha Movie Review In Telugu: మనిషి ఆయుష్షు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ అనంత. నేడు ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కథలోకి వెళితే.. రదేశ్ (ప్రశాంత్ కార్తీ) ఒక ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. అయితే ఆయన పనిచేస్తున్న యూనివర్సిటీ నుంచి ప్రతి పదేళ్లకు ఒక్కసారి మారిపోతుంటాడు. అలా ప్రస్తుతం పని చేస్తున్న యూనివర్సిటీ నుంచి ఆయన మారిపోతుండగా.. సైటిస్టులు ప్రద్యుమ్న (అనీష్ కురువెళ్ళ), ధర్మా (గెడ్డం శ్రీనివాస్), శృతీ (రిత్తిక చక్రవర్తి) వీడ్కోలు పలికేందుకు రదేశ్ ఇంటికి వస్తారు. యూనివర్సిటీ నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారని రదేశ్‌ను అడుగుతారు. ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. 15 వేల సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి రదేశ్. ఆయనకు వయసు పెరగడం ఆగిపోయి ఉంటుంది. మరణం ఉండదు.. ఆయన వయసు గుర్తించేలోపు.. ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిపోతుంటాడు. ఈ విషయాన్ని తన వద్దకు వచ్చిన సైంటిస్టులకు రదేశ్ చెబుతాడు. ఈ రదేశ్ ఎవరు..? ఆయన నిజంగానే 15 వేల సంవత్సరాల క్రితం పుట్టాడా..? ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ప్రద్యుమ్నతో రదేశ్‌కు ఉన్న రిలేషన్ ఏంటి..? ఈ విషయాలు అన్ని అనంత సినిమా తప్పకుండా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
మనిషి ఆయుష్షు లైన్‌ను బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని.. గతంలో ఎప్పుడు చూడని కోణాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు మధుబాల. తాను పేపర్ రాసుకున్న ప్రతి సీన్‌ను కళాత్మకంగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో మధుబాల కాస్త సక్సెస్ అయ్యాడు. మనం సాధారణంగా మరణం లేని పాత్రలను పురాణ గాథల్లోనే చూశాం. అలాంటిది ప్రస్తుత ట్రెండ్‌లో ఇలాంటి క్యారక్టర్‌ను పరిచయం చేయడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ప్రముఖ ట్రెక్ రైటర్ జెరోం బిక్స్బీ రాసిన స్టోరీని బేస్ చేసుకుని అనంత మూవీని తెరకెక్కించారు.
రదేశ్ ఇంటికి వీడ్కోలు పలికేందుకు సైంటిస్టులు వచ్చిన సమయంలో చెప్పే విషయాలు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తాయి. ఈ మాటలను విజువల్‌గా చూపించి ఉంటే మరో లెవల్ ఎక్స్‌పీరియన్స్ ఉండేది. ఫస్ట్ హాఫ్ అంతా సహచరులు ప్రశ్నలకు రదేశ్ జవాబులు చెప్పడంతో సాగిపోతుంది. తాను గతంలో చూసిన విషయాలను రదేశ్ చెబుతున్న సందర్భంలో ఆడియన్స్‌కు జ్ఞానాన్ని అందిస్తాయి. ఇక సెకండాఫ్ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని అంశాలు ప్రేక్షకులు సీట్లలోను నుంచి కదలనీయకుండా చేస్తాయి. ఇక చివరగా క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌తో ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. ఈ సీన్ విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవాలి.
ఎవరు ఎలా నటించారు..?
ఇటీవల కంట్రావర్సీ కింగ్ ఆర్‌జీవీ డైరెక్షన్‌లో తెరకెక్కిన కొండా మూవీలోని నక్సలైట్ నాయకుడు ఆర్కే రోల్ పోషించి ఆకట్టుకున్న ప్రశాంత్ కార్తీ.. ఈ సినిమాలో కొత్త పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రొఫెసర్ రదేశ్ క్యారక్టర్‌లో ప్రశాంత్ ఒదిగిపోయాడు. అనీష్ కురువెళ్ళ, గెడ్డం శ్రీనివాస్ తమ సహజ నటనతో ఆడియన్స్‌ను అలరించారు. శృతిగా రిత్తిక చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పొచ్చు. మిగిలిన పాత్రల్లో నటీనటులు మెప్పించారు. ఘంటశాల విశ్వనాథ్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అయితే పాటలు పెద్దగా ఆకట్టుకోలేవు. సిద్దు సొంసెట్టి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఆడియన్స్‌కు మంచి అనుభూతిని అందిస్తాయి.
రేటింగ్: 2.5/5
Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన
Also Read: Virat Kohli Eating Pic: ఫుడ్ తినడానికే ఔట్ అయ్యవా..? విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి