Virat Kohli Eating Pic: ఫుడ్ తినడానికే ఔట్ అయ్యవా..? విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఫైర్

Ind vs Aus WTC Final Day 2 Highlights: విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. రెండో రోజు ఆటలో కోహ్లీ తక్కువ స్కోరుకే ఔట్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే కాసేపటికే ఫుడ్ తింటూ కనిపించడంతో నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 9, 2023, 11:09 AM IST
Virat Kohli Eating Pic: ఫుడ్ తినడానికే ఔట్ అయ్యవా..? విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఫైర్

Ind vs Aus WTC Final Day 2 Highlights: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌గా నిలవాలనే భారత్ ఆశలు ఆడియాశలు అయ్యేలా కనిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 469 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 318 పరుగుల వెనుకంజలో ఉండగా.. ఫాలో ఆన్ గండం తప్పాలాంటే ఇంకా 119 పరుగులు చేయాల్సి ఉంది. 

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ (14), శుభ్‌మన్ గిల్ (13) చేతులెత్తేయగా.. రోహిత్‌ శర్మ (15), పుజరా (14) కూడా నిరాశపరిచారు. రవీంద్ర జడేజా (48) ఒక్కడే క్రీజ్‌లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు ఆశలన్నీ అజింక్యా రహానే (29), కేఎస్ భరత్‌ (5)పైనే ఉన్నాయి. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఎంత సేపు క్రీజ్‌లో ఉంటే.. టీమిండియా అంత సేఫ్‌ జోన్‌లోకి వెళుతుంది. లేదంటే మ్యాచ్‌తోపాటు ట్రోఫీపై కూడా ఆశలు వదులుకోవాల్సిందే. 

ఇక రెండో రోజు విరాట్ కోహ్లీ ఔట్ అయిన తరువాత నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 31 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం     14 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అయితే ఔట్ అయిన వెంటనే పెవిలియన్‌కు వెళ్లి ఫుడ్ తింటూ ఇషాన్ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌తో మాట్లాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్‌ను నెటిజన్లు షేర్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు.

 

కోహ్లీ తినడానికే తొందరగా ఔట్ అయి.. పెవిలియన్‌కు వెళ్లిపోయాడా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ముఖ్యమైన మ్యాచ్‌లో జట్టును ఆదుకోలేకపోయిన బాధ కోహ్లీలో కొంచెం కూడా లేదని అంటున్నారు. ఈ పిక్‌లో ఉంది రోహిత్ శర్మ కాదు.. విరాట్ కోహ్లీ అని కామెంట్లు పెడుతున్నారు. వరల్డ్ కప్ 2003 ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ తక్కువ పరుగులు చేసి ఔట్ అయినందుకు ఆ బాధతో మూడు రోజులు ఆహారం తినలేదని.. కానీ కోహ్లీ మాత్రం ఔట్ అయిన వెంటనే ఎలాంటి బాధ లేకుండా ఫుడ్ తింటున్నాడని అంటున్నారు. మరోవైపు కోహ్లీ ఫ్యాన్స్‌ కూడా దీటుగా బదులిస్తున్నారు. ఫుడ్ తినే విషయంపై కూడా ట్రోల్ చేయాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు.

 

 

Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన  

Also Read: Adipurush: ఆది పురుష్ మొదటి టార్గెట్ పఠానే! రికార్డులకు చాలవు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News