Ajith in KGF 3: కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ హీరోగా నటించిన.. సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఈ సినిమాతో ప్రభాస్ కి.. మర్చిపోలేని హిట్ అందించిన ప్రశాంత్ త్వరలో ఎన్టీఆర్ హీరోగా కూడా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా ప్రశాంత్ నీల్.. కోలివుడ్ స్టార్ హీరో అజిత్ ని కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు కథలను నేరేట్ కూడా చేశారట. అంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అజిత్ రెండు సినిమాలు చేయబోతున్నారు. అందులో ఒకటి స్టాండ్ అలోన్ సినిమా అని సమాచారం. 


అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రెండవ సినిమా కే జి ఎఫ్ త్రీ అని తెలుస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కే జి ఎఫ్ 2 క్లైమాక్స్ లోనే సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది.. అని ప్రశాంత్ ప్రకటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కచ్చితంగా కే జి ఎఫ్ త్రీ ఉంటుంది అని.. అందుకే క్లైమాక్స్ లో ప్రకటించాము అని స్పష్టం చేశారు. 


దీంతో ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఒక సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్లు అర్థమైంది. ఇప్పుడు అజిత్ కూడా ఇందులో భాగం కాబోతున్నట్లు సమాచారం. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. 


ప్రస్తుతం అజిత్ తమిళ్లో విదాముయార్చి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు అజిత్. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తో చేతులు కలపబోతున్నారు అజిత్. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.


ఆ సినిమా కూడా పూర్తయిన తర్వాత మాత్రమే కేజీఎఫ్ 3 సినిమా సెట్స్ మీదకి వెళుతుంది. సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి కానీ మొదలవడానికి ఇంకా సమయం పడుతుంది.


Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ


Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter