Prashanth Varma-Mokshagna:  ఆ, కల్కి, జోంబీ రెడ్డి వంటి సినిమాలతో.. మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ మధ్యనే.. తేజ సజ్జ హీరోగా నటించిన.. హను మ్యాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఒక్క సినిమా సూపర్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్ గా రాబోతున్న.. జై హనుమాన్ మీద కూడా భారీ అంచనాలు.. నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలు పక్కన పెడితే.. ప్రశాంత్ వర్మ చేస్తున్న మిగతా ప్రాజెక్టుల మీద హైప్.. అనవసరంగా రోజురోజుకీ పెరిగిపోతుంది.. అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 


నిజానికి హనుమ్యాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. డివివి దానయ్య తనయుడిని లాంచ్ చేస్తూ చేయాల్సిన సినిమాని కూడా పక్కన పెట్టేశారు. తన చేతిలో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులు కూడా హోల్డ్ లో పెట్టేసి.. ప్రశాంత్ వర్మ బాలీవుడ్లో రన్వీర్ సింగ్ తో ఒక సినిమా ప్లాన్ చేశారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఇది చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రన్వీర్ సింగ్.. ఒక టెస్ట్ షూట్ లో కూడా పాల్గొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.


అప్పటిదాకా సినిమా మీద పెరిగిపోయిన హైప్ కాస్త.. బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఇక తాజాగా ఇప్పుడు ప్రశాంత్ వర్మ..నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన బేసిక్ వివరాలు కూడా తెలియక ముందే.. సినిమా గురించి మామూలు హైప్ రావడం లేదు. 


అయితే ఇలాంటి అనవసరమైన హైప్ కారణంగా ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా.. డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సినిమాల మీద మరీ ఇంత హైప్ పెంచాల్సిన అవసరం లేదు అని ప్రశాంత్ వర్మకి సూచిస్తున్నాయి. అంతేకాకుండా మల్ల ఈ సినిమా కూడా ఎక్కడ రణవీర్ సింగ్ సినిమా లాగా అవుతుందా అని.. అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. రణవీర్ సింగ్ సినిమా విషయంలో కూడా.. అంచనాలు పెరిగిపోవడం వల్ల.. అయినా ప్రశాంత్ వర్మ కథ అంచనాలను అందుకోదేమో అని భావించే రణవీర్ సింగ్ ఆ ప్రాజెక్ట్ వదులుకున్నారని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు మళ్లీ మోక్షాత్న విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమోనని అభిమానులు భయపడుతున్నారు.


సినిమా విడుదలయ్యాక సినిమా సక్సెస్ తో రావాల్సిన హైప్ విడుదలకి ముందే.. మనం క్రియేట్ చేయకూడదు అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి


Also Read: Pawan Kalyan: సినిమాలపై పవన్‌ కల్యాణ్‌ సంచలన ప్రకటన.. ఓజీ సినిమాపై ఏం చెప్పారంటే?


Also Read: Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter