Tantra Teaser: ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మల్లేశం ఇలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల. ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాలో తన నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. కాక ఇప్పుడు అనన్య ప్రధాన పాత్రలో నటించిన 'తంత్ర ' సినిమా మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.‌ఇక ఈ మూవీ టీజర్ ఈరోజు ప్రియదర్శి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది.
 
‘ఊరిలో పుట్టిన దుష్టశక్తి రక్తదాహంతో విరుచుకుపడుతోంది..’ అంటూ అందరికీ వెన్నులో భయం కలిగించే లాంటి ఒక డైలాగ్ తో కట్ అయిన టీజర్ రకరకాల తాంత్రిక పూజలని చూపిస్తూ తెలుగు ప్రేక్షకులు త్వరలోనే ఒక మంచి హారర్ త్రిల్లర్ చూడబోతున్నారు అని క్లూ ఇచ్చేసింది. టీజర్‌ని బట్టి ఈ సినిమాలో మన పురాతన తాంత్రిక రహస్యాలని వెలికితీస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ అనన్య దుష్టశక్తి బారిన పడిన అమ్మాయిగా కొత్తగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడూ చేయని పాత్రలో అనన్య కనిపించబోతోంది అని ఈ సినిమా దర్శకుడు అలానే ఈ చిత్ర నిర్మాతలు తెలియజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి ఈ మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు.ఇక ఈ చిత్రంలో క్షుద్రపూజలు చేసే తాంత్రికుడిగా 'టెంపర్ వంశీ' కనిపించబోతున్నారు. అంతేకాకుండా మర్యాద రామన్న లాంటి సినిమాలో నటించిన హీరోయిన్ సలోని కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేయనుంది. కాగా ఈమె పాత్ర మిస్టీరియస్‌గా కనపడుతోంది. ఏది ఏమైనా సలోని ఈ సినిమాతో గట్టిగా రీ-ఎంట్రీ ఇస్తోందని అర్ధమౌతోంది.
 
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హర్రర్ ట్రెండ్ నడుస్తోంది. క్షుద్రపూజలు ఇతివృత్తంగా వస్తున్న సినిమాలు బ్లాక్‌బస్టర్ అవుతున్న ఈ నేపథ్యంలో ఈ చిత్రం కూడా తప్పక విజయం సాధిస్తుంది అని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. రీసెంట్‌గా మంగళవారం సినిమాతో ఆకట్టుకున్న మీసాల లక్ష్మణ్ ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేసారని తెలుస్తోంది.
 
ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్ట్‌డిస్నీలో పనిచేసిన శ్రీనివాస్ గోపిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ చేస్తున్నారు. టీజర్ చూసి ఇంప్రెస్ అయిన ప్రియదర్శి దీనిని లాంచ్ చేయడానికి ముందుకొచ్చారని మేకర్స్ చెబుతున్నారు. 


Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..


Also Read:  CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి